
విజయసాయిరెడిపై వైసీపీ దిమ్మతిరిగే ట్వీట్
అమ్ముడు పోయాడనడానికి పక్కా ఆధారాలు అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ఒక సంచలన ట్వీట్ చేసింది.
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మీద వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ సంచలన కామెంట్ చేసింది. తెలుగుదేశం పార్టీకి, సీఎం చంద్రబాబుకు విజయసాయిరెడ్డి అమ్ముడుపోయాడనడానికి పక్కా ఆధారాలు ఉన్నాయంటూ సోషల్ మీయా వేదికగా వెల్లడించింది. తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్థన్‌తో విజయసాయిరెడ్డి భేటీ అవుతున్నట్లు కనిపిస్తున్న ఒక సెన్‌సేషనల్ వీడియోను వైసీపీ రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలో కొలువుదీరిన తర్వాత లిక్కర్ స్కామ్‌ను తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం ఈ స్కామ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ స్కామ్‌లో ఒక నిందితుడుగా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సీఐడీ విచారణకు హాజరయ్యే కొన్ని గంటల ముందు టీడీపీ నేత టీడీ జనార్థన్‌తో రహస్య భేటీ అయ్యారని వెల్లడించింది. ఆ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఓ ట్వీట్ చేసింది.
అందులో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ ఏమని పేర్కొందంటే..
విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడనడానికి పక్క ఆధారాలు ఉన్నాయి. మద్యం కుంభకోణంపై సీఐడీ విచారణకు కొన్ని గంటల ముందు రహస్య సమావేశం జరిగింది. అదీ కూడా తాడేపల్లి పార్క్ విల్లాలో జరిగింది. విజయసాయిరెడ్డి విల్లా నంబబరు 27కు సాయంత్రం 5:49 కు నారా చంద్రబాబు నమ్మిన బంటు టీడీ జనార్థన్ వచ్చారు. విజయసాయిరెడ్డి నారా చంద్రబాబు నమ్మిన బంటు టీడీ జనార్థన్‌తో 45 నిముషాల పాటు రహస్య మంతనాలు జరిపారు. విచారణ ముగిసిన వెంటనే మీడియా ముందు వైఎస్ జగన్‌పై విమర్శలు, విషపు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ నమ్మి, దగ్గర పెట్టుకుని, పార్టీలో క్రియాశీలక పదవులతో పాటు రాజ్యసభకు పంపిగౌరవిస్తే ఇంకా మూడేళ్లు పదవీ కాలం ఉన్నా చంద్రబాబుకు మేలు చేసేందుకు విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు.
ఇది నమ్మక ద్రోహం కాదా? అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. దీని కింద టీడీపీ నాయకుడు టీడీ జనార్థన్ విజయసాయిరెడ్డిని కలిసే వీడియోను కింద వైపు, దానికిపైన విజయసాయిరెడ్డి మీద ఇటీవల జగన్ వ్యాఖ్యలను జత చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇప్పుడిది సంచలనంగా మారింది. నెట్టింట దీని గురించే చర్చించుకుంటున్నారు.
Next Story