
వైసీపీ నాయకుల బుద్ధి మారడం లేదు
అధికారంలో ఉండగా చేసిన దళితులపై దమనకాండను ఇప్పుడూ వైసీపీ నాయకులు కొనసాగిస్తున్నారని మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి నారా లోకేష్ మరో సారి వైసీపీ పార్టీ మీద, ఆ పార్టీ నాయకుల మీద ధ్వజమెత్తారు. ఎన్నికల్లో వైసీపీని ప్రజలు చీత్కరించినా ఆ పార్టీ నాయకుల బుద్ధి మాత్రం మారలేదని మండిపడ్డారు. తిరుపతిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అనుచరుల ఘటనపై మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తిరుపతిలో ఓ యువకుడిపైన వైసీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. రప్పా రప్పా అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు రప్ఫాడిస్తాడిస్తారని హెచ్చరించారు. దాడికి సంబంధించిన వీడియోను, దానికి మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోను జత చేసి షేర్ చేశారు.
లోకేష్ ఏమన్నారంటే..
ప్రజలు చీత్కరించినా వైసీపీ నాయకుల బుద్ధి మారడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్ బాడీ డోర్ డెలివరీ వరకు దళితులపై దమనకాండ జరిపిన వైసీపీ నాయకులు ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగిస్తున్నారు. తిరుపతిలో వైసపీ నాయకులు దళిత యువకుడిపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇటువంటి దాడులకు ఏపీలో చోటు లేదు. రపరపా అంటే ఏపీ పోలీసులు రప్ఫాడిస్తారు.. అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.
Next Story