టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి కాంట్రొవర్శి.. సస్పెండ్‌ చేయాలంటూ మహిళల నిరసన
x

టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి కాంట్రొవర్శి.. సస్పెండ్‌ చేయాలంటూ మహిళల నిరసన

చిలికి చిలికి గాలివానల మారిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారం. ప్రభుత్వానికి తలనొప్పిగా మారడంతో ఇప్పటికే వార్నింగ్‌ ఇచ్చిన టీటీడీ అధిష్టానం.


తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతోంది. ఆయన గెలిచిన నాటి నుంచి అరాచక వాదిగా మారారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆది నుంచి ఆయన వ్యవహార శైలి విదాస్పదంగానే మారిందనే విమర్శలు వినినిపిస్తున్నాయి. తిరువూరు నియోజక వర్గం పరిధిలో అన్ని వర్గాల ప్రజలు ఆయనన వ్యతిరేకిస్తున్నారు. గుడ్డలిప్పి కొడతానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో మహిళలు కూడా రోడ్డెక్కారు. టీడీపీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ చిట్టేల గ్రామంలో మహిళలు రహదారిపై నిరసన ప్రదర్శన నిర్వహించారు. మహిళల పట్ల ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగుల వాట్సాప్‌ నంబర్లకు ఆయన అసభ్యకరంగా సందేశాలు పంపిస్తూ లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కొలికపూడిపై చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని, లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని మహిళలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొలికపూడి తన క్యాంపు కార్యాలయంలో నిరాహార దీక్ష చేపట్టారు. తనపై ఆరోపణలు నిజమైతే అరెస్టు చేసి శిక్షించాలని, ఆరోపణలు రుజువు కాకపోతే ఆరోపణలు చేసిన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై టీటీడీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. కొలికపూడి దీక్షను విరమింప చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో తాను చేపట్టిన దీక్షను విరమిస్తున్నట్లు కొలికపూడి ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం రాత్రి తిరువూరు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కొలికపూడి మాట్లాడుతూ తనపై ఆరోపణలు చేస్తున్న మహిళ ఇప్పటి వరకు దాదాపు నాలుగు పర్యాయాలు సూసైడ్‌ చేసుకునేందుకు పాల్పడినట్లు చెప్పారు. పోలీసులు ఆమె భర్తపై కేసు పెట్టిన ప్రతి సారి ఇలా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు డ్రామాలు అడుతుంటుందని విమర్శలు చేశారు. తనపై పథకం ప్రకారమే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, దీనిని తిరువూరు అసెంబ్లీ నియోజక వర్గ ప్రజలు నమ్మరని అన్నారు.

Read More
Next Story