ఇథనాల్ కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన మహిళలు
x

ఇథనాల్ కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన మహిళలు

తమ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ(Ethanol Factory) వద్దనే డిమాండుతో జిల్లాలోని దిలావర్ పూర్ మహిళలు భారీసంఖ్యలో రోడ్డుపై పెద్దఎత్తున ప్రదర్శన చేశారు.


రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ వివాదం మరువక ముందే నిర్మల్ జిల్లాలో మరో గోల మొదలైంది. జిల్లాలో ఏర్పాటుచేయాలని ప్రభుత్వం డిసైడ్ చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా మహిళాలోకం రోడ్డెక్కింది. తమ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ(Ethanol Factory) వద్దనే డిమాండుతో జిల్లాలోని దిలావర్ పూర్ మహిళలు భారీసంఖ్యలో రోడ్డుపై పెద్దఎత్తున ప్రదర్శన చేశారు. దాంతో పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. రేవంత్(Revanth) నియోజకవర్గం కొడంగల్(Kodangal) లో ఫార్మా యూనిట్లు ఏర్పాటును వ్యతిరేకిస్తు జనాలు ఎంత గోలచేస్తున్నారో అందరూ చూస్తున్నదే. చివరకు గ్రామసభ పెట్టినపుడు గ్రామస్తులు, రైతుల్లో కొందరు ఏకంగా కలెక్టర్ ప్రతీక్ జైన్(Collector Pratik Jain) మీదే దాడియటం తెలంగాణా వ్యాప్తంగా సంచలనమైపోయింది.

కలెక్టర్ మీద దాడి తాలూకు వివాదం ఇంకా సమసిపోలేదు. ఇంతలో దిలావర్ పూర్ లో ప్రభుత్వం ఏర్పాటుచేయాలని అనుకుంటున్న ఇథనాల్ ఫ్యాక్టరి వద్దంటు వందలసంఖ్యలో మహిళలు రోడ్డుమీద భారీ ప్రదర్శన చేశారు. వీరికి మద్దతుగా కొందరు మగవాళ్ళు కూడా నిలబడ్డారు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా తాము స్ధానిక ప్రజాప్రతినిధులను కలవటానికి ప్రయత్నిస్తే వాళ్ళు అందుబాటులో ఉండటంలేదనే మంట కూడా మహిళల్లో కనబడింది. అందుకనే బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) ప్రజాప్రతినిధుల ఫొటోలను బ్యానర్లలో ముద్రించి కనబడటంలేదని రాసి ప్రదర్శించటం ఇపుడు చర్చనీయాంశమైంది. పరిశ్రమఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాల్సిందే అని మహిళలు డిమండ్ చేశారు.

బీజేపీ నేత, నిర్మల్ ఎంఎల్ఏ(Nirmal MLA Aleti Maheswar Reddy) ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయినదానికి కానిదానికి ప్రభుత్వానికి ఏలేటి వ్యతిరేకంగా ఆరోపణలు, విమర్శలతో తరచూ రెచ్చిపోతుంటారు. మరి లోకల్ గా మహిళలు ఇంతగా వ్యతిరేకిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో ఎందుకు ఉపేక్షిస్తున్నారో ఎవరికీ అర్ధంకావటంలేదు. ఇన్ని వందలమంది మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో ఏలేటి కూడా వ్యతిరేకంగా గొంతువిప్పాలి కదా అని మహిళలు మండిపోతున్నారు. మరి ఇథనాల్ ఫ్యాక్టరీపైన ఇపుడు మొదలైన వివాదం చివరకు ఎక్కడకు దారితీస్తుందో చూడాల్సిందే.

Read More
Next Story