Pushpa-2|‘పుష్ప’ తొక్కిసలాటలో మహిళ మృతి
x

Pushpa-2|‘పుష్ప’ తొక్కిసలాటలో మహిళ మృతి

అనుకున్నట్లే సంథ్య ధియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది.


అనుకున్నట్లే జరిగింది. పుష్ప-2 రిలీజ్ సందర్భంగా థియోటర్ల దగ్గర భారీ తొక్కిసలాట జరుగుతుందని అనుకుంటునే ఉన్నారు. అనుకున్నట్లే సంథ్య ధియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే పుష్ప-2(Pushpa-2) సినిమా చూడటానికి దిల్ సుఖ్ నగర్ కు చెందిన ఫ్యామిలి ఆర్టీసీ క్రాస్ రోడ్స్(RTC Cross Roads) లో ఉన్న సంధ్య థియేటర్(Sandhya Theater) కు గురువారం ఉదయం 7.30 గంటలకు చేరుకుంది. ప్రీమియర్ షో చూడటానికి భాస్కర్, రేవతి దంపతులు తమ ఇద్దరు పిల్లలు శ్రీతేజ, సన్వీకతో కలిసి సంధ్య ధియేటర్ కు చేరుకున్నారు. థియేటర్లోకి వెళ్ళేందుకు ప్రయత్నించారు. అయితే అదే సమయంలో పుష్ప-2 హీరో అల్లు అర్జున(Allu Arjun) అక్కడికి చేరుకున్నారు. దాంతో హీరోను చూడటానికి అభిమానులు ఒక్కసారిగా తోసుకుని వచ్చేశారు.



పోలీసులు ఎంతగా ప్రయత్నించినా అభిమానులను కంట్రోల్ చేయలేకపోయారు. దాంతో పెద్దఎత్తున తొక్కిసలాట(Stampede) జరిగింది. ఆ తొక్కిసలాటలో భాస్కర్, కూతురు సన్వీక ఒకవైపు భార్య రేవతి, కొడుకు శ్రీతేజ మరోవైపు చిక్కుకుపోయారు. తొక్కిసలాటలో తల్లి, కొడుకు కిందపడిపోయారు. వీళ్ళు కిందపడిపోయినా ఎవరూ లేపే ప్రయత్నంచేయలేదు. పైకి లేపగపోగా వీళ్ళని తొక్కుకుంటూ వెళ్ళారు. విషయాన్ని గమనించిన పోలీసులు రంగంలోకి దిగినా ఉపయోగంలేకపోయింది. కిందపడిపోవటంతో ఊపిరి ఆడక రేవతి అపస్మారస్ధితిలోకి వెళ్ళి తర్వాత కొద్దిసేపటికే మరణించగా కొడుకు పరిస్ధితి సీరియస్ గా ఉంది. దాంతో శ్రీతేజను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. రేవతి మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More
Next Story