పేదవాడి వైద్యాన్ని ప్రైవేటుకు అమ్మేస్తారా?
x
నిర్మాణం పూర్తయిన మెడికల్‌ కాలేజీ ఫోటోను చూపుతున్న వైఎస్‌ జగన్‌

పేదవాడి వైద్యాన్ని ప్రైవేటుకు అమ్మేస్తారా?

అనకాపల్లి జిల్లా మాకవరపాలెం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ సందర్శనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

రాజధాని అమరావతి కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధపడిన ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు మేలు చేసే ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు రూ.5 వేల కోట్లు వెచ్చింలేరా? అని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. పేద వాడి వైద్యాన్ని ప్రైవేటుకు అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు. గురువారం సాయంత్రం అనకాపల్లి జిల్లా మాకవరపాలెం ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..?


మాకవరపాలెం మెడికల్‌ కాలేజీ వద్ద మీడియాతో మాట్లాడుతున్న జగన్‌

కోట్లాది పేదల కోసమే మెడికల్‌ కాలేజీలు..
‘పేదలకు సూపర్‌ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలందించాలనే సంకల్పంతో మా ప్రభుత్వ హయాంలో ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను మంజూరు చేశాం. ఇవి అందుబాటులోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా కోట్ల మందికి మేలు జరుగుతుందని, ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి గురికుండా అడ్డుకట్ట పడుతుందని భావించాం. కానీ సీఎం చంద్రబాబు వీటిని ప్రైవేటీకరణకు పూనుకుంటున్నారు. ఇవి ప్రైవేటుపరం చేస్తే పేదవారికి ఉచిత వైద్యం ఎలా అందుతుంది? 2019 వరకు రాష్ట్రంలో 12 మెడికల్‌ కాలేజీలున్నాయి. ఉత్తరాంధ్రలో కేవలం 1923లో కట్టిన కేజీహెచ్‌ మాత్రమే ఉంది. వైఎస్సార్‌ హయాంలో శ్రీకాకుళంలో రిమ్స్‌ తెచ్చారు. మా హయాంలో ఉత్తరాంధ్రలో మరో నాలుగు మెడికల్‌ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. వీటిలో విజయనగరం, పాడేరు కాలేజీలతో పాటు ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, పులివెందులలలోనూ క్లాసులు ప్రారంభమయ్యాయి. నర్సీపట్నం, పార్వతీపురం కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. పలాసలో కిడ్నీ రీసెర్చి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పూర్తయింది. మరో ఐదు ఐటీడీఏ ఆస్పత్రులు డోర్నాల, బుట్టాయగూడెం, సీతంపేట, పార్వతీపురం పూర్తయ్యాయి. చంద్రబాబు వచ్చాక మాకు మెడికల్‌ కాలేజీలు వద్దని తిరస్కరించారు.
రూ.ఐదు వేల కోట్లు ఖర్చు చేయలేరా?
ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీకు రూ.8 వేల కోట్లు అవసరం. ఇందులో రూ.3 వేల కోట్లు చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికే ఖర్చు చేశాం. అమరావతిలో రోడ్లు, భవనాల నిర్మాణాలకు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధపడుతున్నారే? రాజధానికి 50 వేల ఎకరాలు చాలవని మరో 50 వేల ఎకరాలు సేకరిస్తున్నారు. ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ఈ ఐదేళ్లలో మరో రూ.5 వేల కోట్లు మెడికల్‌ కాలేజీలకు ఖర్చు చేయలేరా? 2019 నాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 2360 సీట్లుంటే.. కొత్త కాలేజీల ద్వారా మరో 2550 సీట్లు అదనంగా వస్తాయి. కానీ ఇవేమీ పట్టని సీఎం ^è ంద్రబాబు పేద వాడి వైద్యం ప్రైవేటుకు అమ్మేస్తున్నారు. నిధుల్లేవంటూ 17 మెడికల్‌ కాలేజీ నిర్మాణం అపాలని సీఎం అయ్యక మెమో జారీ చేశారు. మా హయాంలో నాబార్డు నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి స్పెషల్‌ అసిస్టెన్స్‌ నిధులు తెచ్చి మెడికల్‌ కాలేజీలను పెట్టాం. మరో 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణం సమకూరింది.
చంద్రబాబు బాటలోనే స్పీకర్‌ కూడా..
స్పీకర్‌ కూడా చంద్రబాబు మాదిరిగానే తప్పడు మాట్లాడుతున్నారు. స్పీకర్‌కు చెబుతున్నా.. అబద్ధాలాడకండి. మోసం చేయకండి. మెడికల్‌ కాలేజీలకు జీవోలివ్వలేదన్నారు. ఇదిగో జీవో నంబరు 204.. తప్పుడు మాటలు చెబుతున్న స్పీకర్‌ ఆ పదవికి అర్హుడువి కాదు.
రేపట్నుంచి రచ్చబండ.. కోటి సంతకాల సేకరణ..
మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపట్నుంచి నవంబరు 22 వరకు గ్రామ, వార్డు స్థాయిలో రచ్చబండ కార్యక్రమాన్ని చేపడతాం. వీటి ప్రైవేటీకరణపై ప్రజలకు చెబుతాం. ప్రతి నియోజకవర్గం నుంచి 50 వేల చొప్పున కోటి సంతకాలు సేకరిస్తాం. అక్టోబర్‌ 28న నియోజకవర్గ కేంద్రాల్లో, నవంబరు 12న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, ర్యాలీలు చేస్తాం. నవంబరు 22 వరకు సంతకాలు సేకరించి 24న ఆ సంతకాల పత్రాలను విజయవాడకు లారీల్లో చేరవేస్తాం. అనంతరం గవర్నరుకు సమర్పిస్తాం. కలిసొచ్చే వారితో వెళ్తాం. అన్యాయాన్ని సరిద్దుకోకపోతే త్రీవ పరిణామాలుంటాయి.
సర్కారు నిర్లక్ష్యంతో గిరిజిన బాలికల మరణాలు..
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఇద్దరు బాలికలు పచ్చకామెర్లతో చనిపోవడానికి సర్కారు నిర్లక్ష్యమే కారణం. సెప్టెంబర్‌ 10న ఈ స్కూలులో 175 మందికి పచ్చకామెర్లు వస్తే పట్టించుకునే పరిస్థితి లేదు. వీరికి స్క్రీనింగ్‌ చేయాలన్న ఆలోచనే రాలేదు. మంచినీరు కలుషితమైనా పట్టించుకోలేదు. అక్కడ ఆర్వో ప్లాంటు ఫిల్టర్లు కూడా మార్చలేదంటే ఏమనాలి. వీరికి చికిత్సకు దగ్గర్లో ఆస్పత్రుల్లేక 200 కి.మీల దూరంలో ఉన్న విశాఖ కేజీహెచ్‌కు పంపాల్సి వచ్చింది. మెడికల్‌ కాలేజీ ఉంటే అందుబాటులో వైద్యం అందేది.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలోనూ మోసమే..
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలోనూ చంద్రబాబుది మోసమే. ఎన్నికల ముందు స్టీల్‌ ప్లాంటును కాపాడతానని చెప్పారు. సీఎం అయ్యాక 32 డివిజన్లు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు వచ్చాక 5 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. రెండు వేల మంది శాశ్వత ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ ఇచ్చారు. కార్మికులకు అలవెన్సులు ఇవ్వలేదు. ఈరోజు నన్ను అనకాపల్లి జిల్లా చోడవరం సుగర్స్‌ రైతులు కలిశారు. 2014–19 మధ్య చంద్రబాబు చోడవరం ఫ్యాక్టరీని ఖూనీ చేశారు. మా పాలనలో రూ. 89 కోట్లిచ్చి ఆదుకుంది. మళ్లీ చంద్రబాబు వచ్చాక రూ.35 కోట్ల జీతాలు, రైతుల బకాయిలు ఇవ్వలేదు.
బల్క్‌ డ్రగ్‌తో మత్స్యకారుల్లో అల్లకల్లోలం..
అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద బల్క్‌ డ్రగ్‌ పార్కు పేరిట అక్కడ మత్స్యకారుల్లో చంద్రబాబు అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. నాలుగు వేల ప్రభుత్వ భూములున్నా వినియోగించకుండా అదనంగా సేకరణకు పూనుకుంటున్నారు. విశాఖలో 4,500 వీధి వ్యాపారులను తొలగించారు వీరికి ప్రత్యామ్నాయ చూపలేదు. వీరిపై ఆధారపడ్డ 32 వేల మంది ఎలా బతుకుతారు? ఉత్తరాంధ్రలోనే కాదు.. రాష్ట్రంలోనూ స్కూళ్లు, ఆస్పత్రులు నిర్వీర్యం అయిపోయాయి. ఆరోగ్యశ్రీని ఎత్తేశారు. వైద్యం అందడం లేదు. ఏ రైతుకూ కనీస గిట్టుబాటు ధర లేదు. పెట్టుబడి సాయం లేదు. రైతు బతకలేని పరిస్థితికి తెచ్చారు’ అని వైఎస్‌ జగన్‌ దుయ్యమట్టారు.
Read More
Next Story