ఛాంపియన్స్ ట్రొఫీలో ఫిబ్రవరి 23 మ్యాచే హైలైటా ?
x

ఛాంపియన్స్ ట్రొఫీలో ఫిబ్రవరి 23 మ్యాచే హైలైటా ?

క్రికెట్ అన్నది ఇండియాలో ఒక మతం లేదా భావోద్వేగాల వ్యవహారం


ఇపుడు దేశంలోని క్రీడాప్రేమికుల దృష్టంతా ఫిబ్రవరి 23వ తేదీనే నిలిచింది. నిజానికి క్రీడా ప్రేమికులనే కాదు దేశంలోని మెజారిటి జనాలు ఫిబ్రవరి 23వ తేదీకోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఫిబ్రవరి 23(February 23rd)వ తేదీకి ఉన్న ప్రాధాన్యత ఏమిటంటే ఆరోజు ఇండియా-పాకిస్ధాన్ క్రికెట్ మ్యాచ్(IND-Pak Cricket Match) జరగబోతోంది. దాయాది దేశాలమధ్య క్రికెట్ మ్యాచ్ జరిగి చాలా సంవత్సరాలవుతోంది. రెండు దేశాల మధ్య నెలకొన్న అనేక సమస్యల కారణంగా పాకిస్ధాన్ కు వెళ్ళటం, క్రికెట్ మ్యాచులు ఆడటాన్ని మనదేశం మానుకుంది. మామూలుగానే రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచంటే రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నదా అన్నంత ఉద్రిక్తంగా ఉంటుంది వాతావరణం. విషయం ఏమిటంటే ఈరోజు నుండి ఛాంపియన్స్ ట్రొఫీ(Champions Trophy) మొదలవ్వబోతోంది. వన్డేల్లో వరల్డ్ కప్ తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న కప్ ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రమే అని అందరికీ తెలిసిందే.

2017 ఛాంపియన్ షిప్ మ్యాచుల తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటి(ఐసీసీ) ఛాంపియన్స్ ట్రొఫీని రద్దుచేసింది. తర్వాత అనేక కారణాలతో పునరుద్ధరించినా ట్రొఫీ అయితే జరగలేదు. అలాంటి ప్రాధాన్యతున్న ట్రొఫీని ఐసీసీ మళ్ళీ పునరుద్ధరించింది. అందుకనే 8 ఏళ్ళ తర్వాత జరుగుతున్న ట్రొఫీని పాకిస్ధాన్-యూఏఈ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. పాకిస్ధాన్ కు వెళ్ళి మ్యాచులు ఆడటానికి ఇండియా అంగీకరించకపోవటంతో మనదేశం ఆడాల్సిన అన్నీ మ్యాచులను దుబాయ్(Dubai) లోనే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే 20వ తేదీన బంగ్లాదేశ్ తో మొదటి మ్యాచ్ ఆడబోతోంది మనదేశం. రెండో మ్యాచ్ 23వ తేదీన పాకిస్ధాన్ తో జరుగుతుంది. మూడోమ్యాచ్ మార్చి 2వ తేదీన న్యూజిల్యాండ్ తో జరగబోతోంది.

ముందు బంగ్లాదేశ్ తో జరుగుతున్నా చివరలో న్యూజిల్యండ్ తో జరగబోతున్న దేశంమొత్తం ఎదురుచూస్తున్నది మాత్రం 23వ తేదీన పాకిస్ధాన్ తో జరగబోయే మ్యాచ్ గురించే అనిచెప్పటంలో సందేహమే అవసరంలేదు. మనదేశంలో క్రికెట్ అంటే జస్ట్ క్రీడ మాత్రమే కాదు అదో మతం, అదో భావోద్వేగాల పోరాటంగా మారిపోయింది. 8 జట్లు మాత్రమే పోరాడుతున్న ఈ ఛాంపియన్స్ ట్రొఫీలో ఏ జట్టునూ తక్కువ అంచనా వేసేందుకు లేదు. క్రికెట్ అంటేనే ఎనిబడీస్ గేమ్ అనే నానుడి అందరికీ తెలిసిందే. ఎందుకంటే 50 ఓవర్ల మ్యాచుల్లో ఏ ఓవర్లో ఏమన్నా జరగవచ్చు. ఓడిపోతుందని అనుకున్న జట్టు చివరినిముషంలో గెలవచ్చు. అలాగే కచ్చితంగా గెలుపుఖాయమని అనుకున్న జట్టు తలరాత ఒకే ఓవర్లో మారిపోవచ్చు కూడా. అందుకనే చాలా మ్యాచుల్లో గెలుపోటములు చివరి ఓవర్లలో కాని తేలదు.

ఇపుడు ఆడుతున్న జట్లలో దేన్నీ తక్కువ అంచనా వేసేందుకు లేదు. అందరిలోకి పసికూన అనుకుంటున్న బంగ్లాదేశ్ గతంలో ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లాడ్, సౌత్ ఆఫ్రికా లాంటి మేటి జట్లను కూడా ఓడించిన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎంతోబలమైన జట్టని అనుకున్న ఆస్ట్రేలియా, భారత్ జట్లు కూడా మొదట్లోనే చేతులెత్తేసిన సందర్భాలున్నాయి. మనజట్టులో రోహిత్ శర్మ(Rohit Sarma), కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా, తర్వాత విరాట్ కొహ్లీ(Virat Kohli), శ్రేయస్ అయ్యర్(Sreyas Iyyer), శుభ్ మన్ గిల్(Shubman Gill), హార్డిక్ పాండ్యా, రిషబ్ పంత్ తో బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తున్నా పరుగులు చేసేంత వరకు అనుమానమే. కచ్చీతంగా వీళ్ళంతా కలిసి భారీగా పరుగులు చేస్తారని అనుకునేందుకు లేదు. మన బ్యాటర్లలో ఎప్పుడు ఎవరు ఎలాగ అడుతారో కూడా ఊహించలేము. అలాగే టాప్ క్లాస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయకారణంగా టోర్నీలో ఆడకపోవటం పెద్ద మైనస్ అనేచెప్పాలి. బుమ్రా లేకపోవటంతో ఆర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీ, హార్డిక్ పాండ్యా, హర్షిత్ రాణా పేస్ బాధ్యతలు మోయాలి. అలాగే రవీంద్రజడేజా, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి స్పిన్నర్లుగా రాణించాలి.

ఫిబ్రవరి 23 టెన్షన్ టెన్షన్

ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం ఇండియా-పాకిస్ధాన్ మ్యాచ్ మొదలవుతున్నా ఇప్పటినుండే అదోరకమైన భావోద్వేగాలు మొదలైపోయాయి. ప్రచార, ప్రసార మాధ్యమాల్లో పై రెండుజట్లలోని బలాబలాల గురించి వార్తలు, విశ్లేషణలు మొదలైపోయాయి. పనిలోపనిగా బెట్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. 23వ తేదీ మధ్యాహ్నం నుండి క్రికెట్ ప్రియులు, ఇండియానే గెలవాలని కోరుకునే వాళ్ళంతా టీవీలకు అతుక్కుపోతారనటంలో సందేహంలేదు. ఇండియా-పాకిస్ధాన్ మ్యాచ్ జరిగేరోజుల్లో విద్యార్ధులు, ఉద్యోగుల్లో చాలామంది విద్యాసంస్ధలు, ఆఫీసులకు డుమ్మా కొట్టేయటం మనదగ్గర చాలా మామూలు. వర్కింగ్ డేస్ అయినాసరే రోడ్డు ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటిది ఇండియా-పాకిస్ధాన్ మ్యాచ్ సెలవురోజులోనో లేదా ఆదివారం నాడో వస్తే రోడ్లపైనా ఎవరైనా కనబడతారా ? ఇండియా గెలవాలని దేశంలోని చాలాచోట్ల ముందురోజు నుండే గుళ్ళల్లో పూజలు, హోమాలు చేసేవాళ్ళు పెరిగిపోతారు. ఇండియాను గెలిపించాలని దేవుళ్ళకు మొక్కుకునే వాళ్ళకైతే లెక్కే ఉండదు. అందుకనే క్రికెట్ అన్నది ఇండియాలో ఒక మతం లేదా భావోద్వేగాల వ్యవహారం అన్నది. ఏ టోర్నమెంటులో ఇండియా-పాకిస్ధాన్ మ్యాచ్ జరిగినా టోర్నమెంటు ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నట్లే రెండుదేశాల్లోని అభిమానులు టెన్షన్ ఫీలైపోతారు.

ఇక పాకిస్ధాన్ జట్టు ఈమధ్య నిలకడగా ఆడుతోంది. బాబర్ అజామ్, ఫఖర్ జమాన్, రిజ్వాన్, సల్మాన్ ఆఘా బ్యాటింగ్ లో మంచి ఊపుమీదున్నారు. షహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్ బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నారు. అయితే అనిశ్చితే పాకిస్ధాన్ను పట్టి పీడిస్తోంది. జట్టు సభ్యులందరు ఎప్పుడు ఎలాగ ఆడుతారనే విషయం మ్యాచ్ మొదలైన తర్వాత కాని ఎవరూ ఊహించలేరు. ఏదేమైనా ఇండియాతో మ్యాచ్ అంటేచాలు పాకిస్ధాన్ ప్లేయర్లు తమ స్ధాయికి మించిన ప్రదర్శన చేయాలని తహతహలాడిపోతారనటంలో సందేహంలేదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే గతంలో పలానా బ్యాట్స్ మెన్ అన్ని పరుగులు చేశాడు, ఇన్ని సెంచిరీలు చేశాడన్న రికార్డులు క్రికెట్లో పనికిరావు. గతచరిత్రంతా కామెంటరీలో చెప్పుకోవటానికి, రాసుకోవటానికి మాత్రమే పనికొస్తుంది. మ్యాచ్ లో దిగిన తర్వాత ఎన్నిపరుగులు చేశాడన్నదే మ్యాచ్ గెలుపోటముల్లో కీలకపాత్ర పోషిస్తుంది. మరి ఫిబ్రవరి 23వ తేదీ మ్యాచ్ లో మన జట్టు ఏమిచేస్తుందో చూడాల్సిందే.



మ్యాచుల టైం అండ్ ట్రొఫీ షెడ్యూల్

దుబాయ్ లో ఇండియా ఆడే అన్నీ మ్యాచులు డే నైట్ మ్యాచులే. అందుకనే ఫిబ్రవరి 20వ తేదీ బంగ్లాదేశ్, 23వ తేదీన పాకిస్ధాన్ మ్యాచుతో పాటు మార్చి 2వ తేదీన న్యూజిల్యాండ్ మ్చాచ్ కూడా మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలవుతుంది. స్టార్ స్పోర్స్ట్, స్పోర్ట్స్ 18లో మ్యాచుల లైవ్ స్ట్రీమింగ్ చూడచ్చు.

Read More
Next Story