2019లో ఓడిన టీడీపీ మంత్రులు 2024లో గెలుస్తారా?
x

2019లో ఓడిన టీడీపీ మంత్రులు 2024లో గెలుస్తారా?

విభజన అనంతరం 2014 ఎన్నికల్లో గెలిచి మంత్రులైన పలువురు నేతలు 2019లో ఓడిపోయారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి మంత్రులైన పలువురు నేతలు తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో చాలా మంది ఓడి పోయారు. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. మే 13 జరిగిన 2024 ఎన్నికల్లో తిరిగి వారు గెలుస్తారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి పరిటాల సునీత రాప్తాడు అసెంబ్లీ నియోజక వర్గం నుంచి 2009, 2014లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో గెలిచిన పరిటాల సునీత చంద్రబాబు నాయుడు కేబినేట్లో మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో సునీతకు బదులుగా ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్‌కు సీటిచ్చారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ సారి ఎన్నికల్లో పరిటాల సునీతర టీడీపీ అభ్యర్థిగా రాప్తాడు నుంచి రంగంలో ఉన్నారు. 2024 ఎన్నికల్లో పరిటాల సునీత గెలుస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
ఇదే జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఈ ఎన్నికల్లో బరిలో ఉన్నారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా రాయదుర్గం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి గెలిచిన కాల్వ శ్రీనివాసులు చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో కాల్వ శ్రీనివాసులు ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో కూడా రాయదుర్గం నుంచే టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు.
2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పలమనేరు నుంచి పోటీ చేసి గెలిచిన ఎన్‌ అమర్‌నాథ్‌రెడ్డి తర్వాత ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. తర్వాత ఆయన చంద్రబాబు మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పలమనేరు నుంచి పోటీ చేసి ఓడి పోయారు. తిరిగి టీడీపీ అభ్యర్థిగానే పలమనేరు నుంచి ఈ ఎన్నికలకు దిగారు. 2009లో టీడీపీ నుంచే గెలిచారు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న ఆదినారాయణరెడ్డి కూడా ఇదే కోవలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఆయన తర్వాత టీడీపీలో చేరి చంద్రబాబు నాయుడు కేబినేట్‌లో మంత్రి అయ్యారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. 2004, 2009లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఆయన తర్వాత వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు.
మచిలీపట్నం అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉన్న కొల్లు రవీంద్ర కూడా 2014లో చంద్రబాబు మంత్రి వర్గంలో మంత్రిగా పని చేశారు. 2019లో పోటీ చేసి ఓటి పాలయ్యారు. తిరిగి 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి రంగంలో ఉన్నారు.
నెల్లూరు జిల్లా నుంచి ఇద్దరు మాజీ మంత్రులు కూడా ఇదే కేటగిరీలో ఉన్నారు. వీరు కూడా 2014లో మంత్రులుగా ఉండి 2019లో పోటీ చేసి ఓడి పోయారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నెల్లూరు సిటీ నుంచి రంగంలో ఉన్న పి నారాయణ 2014లో చంద్రబాబు కేబినేట్‌లో మంత్రిగా ఉన్నారు. నాడు ఎమ్మెల్సీగా ఉన్న ఆయన మంత్రి పదవి దక్కించుకున్నారు. తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయారు. తిరిగి 2024లో టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు.
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా 2014లో చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో మంత్రిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఓడి పోడవడంతో చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి కాకాణి గోవర్దనరెడ్డి చేతిలో ఓడి పోయారు. తిరిగి 2024 ఎన్నికల్లో ఆయనపైనే సోమిరెడ్డి బరిలో ఉన్నారు.
2014లో టీడీపీ హయాంలో విప్‌గా ఉన్న కూనా రవికుమార్‌ కూడా 2019లో ఓడి పోయారు. తిరిగి 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా ఇదే కోవలో ఉన్నారు. 2014లో ఆచంట అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన పితాని నాడు చంద్రబాబు నాయుడు హయాంలో మంత్రిగా ఉన్నారు. 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాధరాజు చేతిలో ఓడి పోయారు. తిరిగి 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాలయ అయ్యన్నపాత్రుడు కూడా 2014 గెలిచి మంత్రి అయ్యారు. తర్వాత 2019 ఎన్నికల్లో ఓడి పోయారు. తిరిగి న ర్శీపట్నం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి 2024 ఎన్నికట్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈయన 1983, 1985, 1999, 2004లోను ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ అభ్యర్థిగా కైకలూరు నుంచి ఈ సారి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కామినేని శ్రీనివాస్‌ 2014లో బీజేపీ అభ్యర్థిగా గెలిచి నాడు చంద్రబాబు మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. 2019లో ఈయన పోటీ చేయ లేదు. వేమూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా రంగలో ఉన్న నక్కా ఆనంద్‌ బాబు 2014లో గెలిచి చంద్రబాబు కేబినేట్‌లో మంత్రిగా ఉన్నారు. 2019లో పోటీ చేసి ఓడి పోయారు. తిరిగి 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. చిలకలూరిపేట అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు 2014లో నెగ్గిన తర్వాత చంద్రబాబు మంత్రి వర్గంలో మంత్రిగా పని చేశారు. 2019లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి 2024లో బరిలో ఉన్నారు. ఆళ్లగడ్డ నుంచి 2014లో వైఎస్‌ఆర్‌సీపీ నుంచి బై ఎలక్షన్‌లో గెలిచి తర్వాత టీడీపీలో చేరిన భూమ అఖిల ప్రియ నాడు చంద్రబాబు కేబినేట్‌లో మంత్రిగా ఉన్నారు. 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి టీడీపీ అభ్యర్థిగా ఆళ్లగడ్డ నుంచే బరిలో ఉన్నారు.
Read More
Next Story