రేవంత్ వైఖరిని జనాలు హర్షిస్తారా ?
x

రేవంత్ వైఖరిని జనాలు హర్షిస్తారా ?

హోలు మొత్తంమీద రాజకీయాల్లో విలువలగురించి కాకుండా వ్యక్తిగతంగా నేతలకు ఉన్న ఇమేజీని మాత్రమే జనాలు చూస్తున్నారు.


ఇప్పటి రాజకీయాల్లో విలువలు తగ్గిపోతోంది. హోలు మొత్తంమీద రాజకీయాల్లో విలువలగురించి కాకుండా వ్యక్తిగతంగా నేతలకు ఉన్న ఇమేజీని మాత్రమే జనాలు చూస్తున్నారు. ఎందుకంటే చాలాపార్టీలు అన్నీ హద్దులను మీరిపోయి ప్రత్యర్ధుల మీద చాలా అసభ్యంగా, నీచంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా ఒక యూట్యూబర్(You Tuber) ఇంటర్వ్యూపేరుతో రైతు ముసుగులో ఒక వ్యక్తితో రేవంత్ రెడ్డి(Revanth)ని బండబూతులు తిట్టించిన ఘటన రాష్ట్రంలో సంచలనమైంది. రేవంత్ ను బూతులు తిట్టించిన యూట్యూబర్ పై కేసులు పెట్టి పోలీసులు అరెస్టులు చేయటాన్ని బీఆర్ఎస్(BRS) తీవ్రంగా వ్యతిరేకించటం మరింత సంచలనమైంది. రేవంత్ ను బూతులు తిట్టించినా సరే యూట్యూబర్ మీద కేసులు పెట్టడం, అరెస్టుచేయటం అన్యాయం అన్నట్లుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్9KTR), హరీష్ రావు(Harish), కవిత(Kavitha)లు ప్రభుత్వంపై విరుచుకుపడటమే ఆశ్చర్యంగా ఉంది.

బూతులు తిట్టడం తప్పని ఖండించాల్సిన నేతలు కేసుపెట్టి, అరెస్టుచేయించిన ప్రభుత్వంపై రివర్సులో ఆరోపణలు చేయటమే ప్రస్తుత రాజకీయాల్లో నడుస్తున్న ట్రెండును సూచిస్తోంది. యూబ్యూబర్ పై కేసుపెట్టి, అరెస్టుచేయాన్ని తప్పుపట్టిన కేటీఆర్, హరీష్, కవితను రేవంత్ అసెంబ్లీ సమావేశంలో టార్గెట్ చేసి రెచ్చిపోయాడు. యూట్యూబర్ కు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ కీలకనేతలపై రేవంత్ మాట్లాడుతు స్టేచర్, స్ట్రెచర్, మార్చురీ అంటూ కేసీఆర్ ను ఉద్దేశించే అన్నారన్నట్లుగా అర్ధంవచ్చే వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కీలకనేతలంతా తీవ్రస్ధాయిలో విరుచుకుపడుతున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే బూతులు తిట్టడం, తిట్టించటం, ప్రత్యర్ధులపై నీచంగా సోషల్ మీడియాలో పెట్టడం, లేదా పెట్టించటంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకదానితో మరోటి పోటీపడుతున్నాయి. ఒకపార్టీపై మరోటి పైచేయి సాధించటమే లక్ష్యంగా అన్నీ విలువలను రెండుపార్టీలు మరచిపోయి దిగజారిపోతున్నాయన్నది వాస్తవం.

సమస్యంతా ఎక్కడొచ్చిందంటే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో వచ్చింది. అధికారంలో శాశ్వతంగా తాము ఉండాలన్న ఆలోచన భగ్నం అవటాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవితలు తట్టుకోలేకపోతున్నారు. పుండుమీద కారం చల్లినట్లుగా కాంగ్రెస్(Telangana Congress) అధికారంలోకి రావటమే కాకుండా తమకు బద్ధశతృవైన రేవంత్ సీఎం కావటాన్ని ఈ నేతలు అసలు తట్టుకోలేకపోతున్నారు. అందుకనే రాష్ట్రంలో ఎక్కడ ఏచిన్న ఘటన జరిగినా వెంటనే దాన్ని రేవంత్ కు ముడిపెట్టేసి ఆరోపణలతో బీఆర్ఎస్ నేతలు గోలగోల చేస్తున్నారు. వీళ్ళ వైఖరిని గ్రహించిన రేవంత్ కూడా అంతేస్ధాయిలో వీళ్ళపై రెచ్చిపోతున్నాడు. రేవంత్ కు కాకపోయినా ముఖ్యమంత్రి స్ధానానికి మర్యాద ఇవ్వాలన్న విషయాన్ని బీఆర్ఎస్ నేతలు మరచిపోతున్నారు. ఇదేసమయంలో బీఆర్ఎస్ నేతలపై తనలో పేరుకుపోయిన కసిని రేవంత్ దాచుకోకుండా బాహాటంగానే విరుచుకుపడిపోతున్నారు.

ప్రజలు హర్షిస్తారా ?

రాజకీయాల్లో ఇలాంటి వైఖరిని ప్రజలు ఏమాత్రం హర్షించరు. వ్యక్తిగత దూషణలను జనాలు అంగీకరించరు. ప్రభుత్వ విధానాలు, పథకాలు, అభివృద్ధి పథకాల అమలులో తప్పొప్పులను ప్రతిపక్షాలు ఎత్తిచూపటం మానేసి అధికారపార్టీని కవ్వింపు మాటలతో బాగా రెచ్చగొడుతున్నాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అదేపనిగా ఆరోపణలు, విమర్శలతో బురదచల్లేస్తున్నాయి కాబట్టి రేవంత్ లేదా కాంగ్రెస్ నేతలు అదేపద్దతిలో ఎదురుదాడులు చేస్తున్నారు. రాజకీయపార్టీలకు అదనంగా మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా తోడైంది. మీడియా ముఖ్యంగా ఎలక్ట్రానిక్(టీవీల)మీడియా ఏమిచేస్తోందంటే వ్యూయర్ షిప్ కోసం పదేపదే ఒకళ్ళతో మరొకళ్ళని తిట్టిస్తోంది. స్టూడియోల్లో ఇంటర్వ్యూలకు పిలిచినపుడు ఒక పార్టీ నేతపై మరొక పార్టీ నేత చెప్పులతో కొట్టడం లాంటి ఘటనలు వ్యూయర్ షిప్ పెంచుకోవటంలో భాగంగానే చూడాలి. మొత్తంమీద రేవంత్ వైఖరి కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుందా ? నష్టంచేస్తుందా అన్నదే అర్ధంకావటంలేదు.

జనాలు ఎంతమాత్రం హర్షించరు: గోపిశెట్టి

‘బీఆర్ఎస్, కేటీఆర్ కూడా రేవంత్ ను పర్సనల్ గా ఎటాక్ చేస్తున్న’ట్లు కాంగ్రెస్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్, బీసీ కమిషన్ ఛైర్మన్ గోపిశెట్టి నిరంజన్ వాపోయారు. అనేక కారణాలతో కాంగ్రెస్-బీఆర్ఎస్ రెండూ పర్సనల్ ఎటాక్ చేసుకుంటున్నట్లు చెప్పారు. ‘ప్రతిపక్షాలు రేవంత్ ను కావాలనే బద్నాం చేస్తున్న’ట్లు మండిపడ్డారు. ‘అందుకనే రేవంత్ కూడా తప్పని పరిస్ధితుల్లోనే ప్రతిపక్షాల నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న’ట్లు చెప్పారు. ‘రాజకీయాల్లో ఎవరు వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేసినా తప్పే’ అని అంగీకరించారు. అందరు లిమిట్స్ పాటించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఎవరు వ్యక్తిగత దూషణలకు దిగినా పబ్లిక్ అంగీకరించర’ని గోపిశెట్టి ఒప్పుకున్నారు. ‘ప్రతిపక్షాల ఆరోపణలకు ధీటుగా కాంగ్రెస్ సమాధానం చెప్పలేకపోతోందన్న ఫీలుంగులో పబ్లిక్కు ఉంది కాబట్టే పార్టీ నేతలు ఇలాగ రెచ్చిపోతున్నార’ని చెప్పారు.

ఒక తానుగుడ్డలే : పాశం


సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతు ‘అందరు నేతలు ఒక తాను గుడ్డలే’ అన్నారు. ‘ఆధిపత్యం కోసం అందరు బూతులే మాట్లాడుతున్నార’ని మండిపడ్డారు. బూతుల రాజకీయాలగురించి ఆలోచించటం కూడా వృధానే అన్నారు. ‘వాళ్ళ బూతులను మీడియా కూడా సెన్సార్ లేకుండా వేసేస్తోంద’ని చెప్పారు. కల్చర్ లేని వాళ్ళగురించి మాట్లాడుకోవటం వేస్టని తేల్చేశారు.

Read More
Next Story