
చిట్టి తల్లీ బడికెళ్లు సీటిపిస్తా
మంత్రి నారా లోకేష్ మరో సారి స్పూర్తిగా నిలిచారు.
చిట్టి తల్లీ నిశ్చింతగా చదువుకో.. కేజీబీవీలో సీటు ఇప్పించే బాధ్యత నాది.. అంటూ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తనకు చదువుకోవాలని ఉన్నా.. ఆర్థిక కష్టాలతో పాటుగా కేజీబీకీలో సీటు రాకపోవడంతో కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదూరు గ్రామానికి చెందిన మీనిగ కుమార్, సంతోషమ్మల కుమారెత్త జెస్సీ కూలీగా మారింది. స్వగ్రామంలో ఐదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేసుకున్న జెస్సీ సమీపంలో ఉన్న చిలకలదోణలోని కేజీబీవీలో ఆరో తరగతికి దరఖాస్తు చేసుకుంది. అయితే జెస్సీకి సీటు రాలేదు. జిల్లా అధికారులను కలిసి తమ గోడు వినిపించుకున్నా సీటు దొరక్కపోడంతో ప్రైవేటు పాఠశాలలో చదివే ఆర్థిక స్థోమత లేక కూలీగా మారింది. తల్లిదండ్రులు తమతో పాటు జెస్సీని కూడా పత్తి పనులకు తెలంగాణకు తీసుకెళ్లారు. ఇటీవల రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. తనకు కేజీవీలో సీటు వస్తే చదువుకుంటాను అని జెస్సీ చెప్పిన మాటలు మీడియాలో రావడంతో దీనిపైన సోషల్ మీడియా వేదికగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. మరో సారి స్పూర్తిగా నిలిచారు.