న్యాయం కోసం పోరాడతూనే ఉంటా: సినీ నటి గౌతమి.. ఏమి జరిగిందంటే?
x

న్యాయం కోసం పోరాడతూనే ఉంటా: సినీ నటి గౌతమి.. ఏమి జరిగిందంటే?

ఈ కేసును వదిలి పెట్టే ప్రసక్తే లేదు. న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటానని గౌతమి చెప్పారు.


ప్రముఖ సినీ నటి గౌతమి ఓ సినీ ఫైన్షాయర్‌ చేతిలో మోసపోయారు. ఆయన్ను నమ్మి రూ. 3.1 కోట్లు ఇస్తే, తిరిగి ఇవ్వకుండా హ్యాండిచ్చాడు. దీనిపై గౌతమి న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. తమిళనాడు రామనాథపురం జిల్లాకు ముతుకులత్తూరుకు సమీప ప్రాంతంలో సినీ నటి గౌతమికి 150 ఎకరాల భూమి ఉంది. దీనిని అమ్మాలని ఆమె చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను అమ్మిపెడతానని కారైక్కుడికి చెందిన అళగప్పన్‌ అనే సినీ ఫైనాన్షియర్‌ గౌతమి నమ్మించి ఆమె వద్ద రూ. 3.1 కోట్లు తీసుకుని మోసం చేశాడు. అళగప్పన్‌ నుంచి తన వద్ద తీసుకున్న డబ్బును ఇప్పించాలని కోరుతూ రామనాథపురం జిల్లా ఎస్పీకి గౌతమి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ సినీ ఫైనాన్షియర్‌ను అరెస్టు చేశారు. దీంతో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుగుతోంది. అందులో భాగంగా బెయిల్‌ పిటీషన్‌పై గురువారం విచారణ జరిగింది. దీనికి గౌతమి కూడా కోర్టుకు హాజరయ్యారు. డబ్బులు తీసుకొని మోసం చేసిన ఆ ఫైనాన్షియర్‌కు బెయిల్‌ మంజూరు చేయొద్దని గౌతమి తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. విచారణ అనంతరం గౌతమి మీడియాతో మాట్లాడుతూ న్యాయం జరిగేంత వరకు పోరాడతూనే ఉంటానని, దీనిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పారు.

Read More
Next Story