చెవిరెడ్డికి బెయిలొస్తుందా..వైసీపీలో ఫుల్‌ టెన్షన్‌
x

చెవిరెడ్డికి బెయిలొస్తుందా..వైసీపీలో ఫుల్‌ టెన్షన్‌

బుధవారం విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్‌ పిటీషన్‌లపై విచారణ జరపనుంది.


ఏపీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఆరోపణల ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు, వైఎస్‌ జగన్‌కు అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ లభిస్తుందా.. విజయవాడ కోర్డు చెవిరెడ్డికి బెయిల్‌ మంజూరు చేస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నేడు చెవిరెడ్డి బెయిల్‌ పిటీషన్‌పై విజయవాడ కోర్టులో బుధవారం విచారణ జరగనుంది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జల శ్రీధర్‌రెడ్డి, వెంకటేష్‌ నాయుడుల బెయిల్‌ పిటీషన్‌ల మీద బుధవారం విజయవాడ కోర్టు విచారణ చేపట్టనున్నారు.

మరో వైపు చెవిరెడ్డితో పాటు సజ్జల శ్రీధర్‌రెడ్డి, వెంకటేష్‌ నాయుడులకు బెయిల్‌ మంజూరు కాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం తమ ప్రయత్నాలను ఇప్పటికే ముమ్మరం చేసింది. అందులో భాగంగా బెయిల్‌ ఆదేశాలు ఇవ్వకుండా నిలుపుదల చేయాలని విజయవాడ కోర్టులో సిట్‌ పిటీషన్‌ను దాఖలు చేసింది. లిక్కర్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ముగ్గురి బెయిల్‌ పిటీషన్‌లపైన తమ వైపు నుంచి బలమైన వాదనలు వినిపించేందుకు సిట్‌ విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం పిటీషన్‌ దాఖలు చేసింది. ఈ ముగ్గురు నిందితుల బెయిల్‌ పిటీషన్‌ల మీద వేర్వేరుగా తమ వాదనలు వినిపించేందుకు సిట్‌ సమాయత్తమైంది. ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, వెంకటేష్‌నాయుడుల బెయిల్‌ను మంజూరు చేస్తుందా.. సిట్‌ వాదనల మేరకు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరిస్తుందా అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.
Read More
Next Story