కొడాలి నానీ అమెరికా వెళ్లేందుకు చంద్రబాబు సర్కార్ అంగీకరిస్తుందా?
x

కొడాలి నానీ అమెరికా వెళ్లేందుకు చంద్రబాబు సర్కార్ అంగీకరిస్తుందా?

నానీపై లుక్ అవుట్ నోటీసులు లేనప్పటికీ కేసులు ఉన్నాయి


మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ముంబై ఆస్పత్రిలో చికిత్స పొంది వచ్చిన తర్వాత కూడా ఆయన అమెరికాలో వైద్యం కోసం వెళ్లాలని నిర్ణయించుకోవడమే ఇందుకు కారణం. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతు సుదీర్ఘకాలం ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇటీవలే హైదరాబాద్ లోని తన ఇంటికి చేరుకున్నారు. ఇప్పుడు ఆకస్మాత్తుగా ఆయన్ను అమెరికాలో చూపించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

మాజీ మంత్రి కొడాలి నానికి ముంబైలోని ఏషియన్‌ హార్ట్‌కేర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఏప్రిల్ 2న సర్జరీ జరిగింది. దాదాపు 10 గంటల పాటూ ఈ సర్జరీని డాక్టర్లు నిర్వహించారు. ఆయన్ను వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలోనే ఉంచి ట్రీట్మెంట్ అందించారు. వైద్యుల పర్యవేక్షణలో గత నెల రోజులుగా ఆయన చికిత్స పొందారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు ధ్రువీకరించారు.
మరోవైపు కొడాలి నాని బైపాస్ సర్జరీ విజయవంతం కావడంతో అనుచరులు ఊపిరి పీల్చారు. గుడివాడ శాసనసభ్యుడిగా ప్రజలకు 20 ఏళ్లుగా కొడాలి నాని ఎన్నో సేవలు అందించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. వైసీపీ హయాంలో మంత్రిగా పని చేశారు. చంద్రబాబు, ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసే కొడాలి నానీ ప్రస్తుత అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలపై అసభ్య పదజాలంతో విమర్శించేవారని పలువురు కేసులు పెట్టారు. మట్టి, ఇసుక సహా అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం వాటిపై విజిలెన్స్‌ విచారణలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో ఆయన అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. ఆయనపై ఎటువంటి లుకౌట్ నోటీసులు లేవు. అయినప్పటికీ ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభత్వం విచారణకు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం కూడా అమెరికా వెళ్లేందుకు అభ్యంతరం పెట్టకపోవచ్చుననే కొడాలి నానీ భావిస్తున్నారు.


Read More
Next Story