నెల్లూరులో ఆ అమ్మాయిని ఎందుకంత దారుణంగా చంపారు?
x

నెల్లూరులో ఆ అమ్మాయిని ఎందుకంత దారుణంగా చంపారు?

అతను ఎందుకు పిలిచాడు, ఎందుకు హత్య చేశాడనే దానిపై ప్రస్తుతం నగరంలో చర్చ సాగుతోంది


నెల్లూరులో ఓ విద్యార్థిని ని దారుణంగా చంపివేశారు. నెల్లూరు నగరంలోని కరెంట్ ఆఫీస్ సెంటర్‌లో శనివారం జరిగిన ఈ హత్య సంచలనం సృష్టించింది. బీఫార్మసీ ఫైనల్‌ ఇయర్‌ పూర్తయిన యువతి ఆమె. ఆమె స్నేహితుడే కత్తితో పొడిచి చంపేశాడు. మాట్లాడాలని రూమ్‌కు పిలిచి.. ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రేమోన్మాది ఘాతుకానికి ఆ యువతి బలైందంటున్నారు. శుక్రవారం రాత్రి ఈ దారుణం ఈ దారుణం జరిగింది. బాధితురాలు బీఫార్మసీ విద్యార్థిని మైథిలి ప్రియగా తెలుస్తోంది. మైథిలికి, నిఖిల్‌కు కొంతకాలంగా స్నేహం ఉంది. ఈ క్రమంలో ఆమెను మాట్లాడాలని పిలిచాడు. ఆపై ఆమెపై కత్తితో దాడికి తెగబడ్డాడు నిఖిల్‌. ఘటన అనంతరం నిందితుడు పీఎస్‌లో లొంగిపోయాడు. మైథిలీ మృతదేహాన్ని నెల్లూరు మార్చురీకి తరలించారు. మరోవైపు నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ మైథిలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.
అతను ఎందుకు పిలిచాడు, ఎందుకు హత్య చేశాడనే దానిపై ప్రస్తుతం నగరంలో చర్చ సాగుతోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read More
Next Story