సీఎం చంద్రబాబుపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు?
x

సీఎం చంద్రబాబుపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు?

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఓ అబద్దాల పుట్ట. చెప్పిందొకటి.. చేస్తున్నదొకటి.


వేలాది మంది ప్రజల సమక్షంలో ఎన్నికల్లో హామీలిచ్చి, ఆ మాట ప్రకారం బడ్జెట్‌లో వాటికి నిధులు కేటాయింపులు చేయక పోతే, ఇచ్చిన మాటను తప్పితే సీఎం చంద్రబాబు నాయుడుపై చీటింగ్‌ కేసు ఎందుకు పెట్టకూదని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన తాడేపల్లిలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంతా అబద్దాల పుట్టని విమర్శించారు. బడ్జెట్‌ పెడితే మోసాలు బయటపడుతాయని సీఎం చంద్రబాబుకు తెలుసన్నారు. అందుకే ఇంత కాలం బడ్జెట్‌ పెట్టకుండా సాగదీశారని, బడ్జెట్‌ పత్రాలే సీఎం చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్‌ అని తేల్చాయని, బడ్జెట్‌ను చూస్తే ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌కు సీఎం చంద్రబాబు పాల్పడ్డారని జగన్‌ ధ్వజమెత్తారు.

8 నెలలు అయిపోయిన తర్వాత, ఇంత కాలం బడ్జెట్‌ పెట్టకుండా ఎందుకు సాగదీశారని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర అప్పులు రూ. 14లక్షల కోట్లు అని దుష్ప్రచారం చేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తప్పుడు ప్రచారమే చేశారని, చివరకు గవర్నర్‌తో కూడా అబద్దాలు చెప్పించారని విమర్శించారు. సూపర్‌ సిక్స్‌ హామీలను ఎగ్గొట్టేందుకు సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ. 6.46లక్షల కోట్లు అప్పుంది. అయితే రూ. 14లక్షల కోట్లు అప్పు అని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో 19 శాతం అప్పులు పెరిగితే తమ ప్రభుత్వ హయాంలో 15 శాతం అప్పులు పెరిగాయన్నారు. ఎవరి కాలంలో ఏపీ శ్రీలంకలా మారిపోయిందని నిలదీశారు. అప్పు రత్న బిరుదు ఎవరికివ్వాలి? ఆర్థిక క్రమ శిక్షణ పాటించింది ఎవరు? అని ప్రశ్నించారు.

సూపర్‌ సిక్స్‌ పథకాలను ఎగ్గొట్టేందుకు అన్నీ అబద్దాలే చెప్పారని మండిపడ్డారు. చంద్రబాబు దిగిపోయే నాటికి రూ. 42,183 కోట్లు బకాయిలు పెట్టారని తెలిపారు. చంద్రబాబు హయాంలో జీడీపీ 4.47 శాతం మాత్రమే. రెండేళ్లు కోవిడ్‌ ఉన్నప్పటికీ తమ హయాంలో జీడీపీ 4.83శాతమని, మరి ఎవరి హయాంలో సంపద పెరిగింది అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ రంగంలో ఏపీ వాటా 2.86 శాతమని, తమ ప్రభుత్వ హయాంలో 4.7శాతమని వివరించారు. 2018–19 నాటికి రూ. 3.13లక్షల కోట్లు అప్పు, తమ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ. 6.46లక్షల కోట్లు అప్పు అని, చంద్రబాబు చేసిందంతా అప్పుడు ప్రచారం కాదా? అని జగన్‌ నిలదీశారు.
Read More
Next Story