బాబు జమిలీ ఎన్నికలకు ఎందుకు జైకొడుతున్నారు?
x

బాబు జమిలీ ఎన్నికలకు ఎందుకు జైకొడుతున్నారు?

జమిలీ ఎన్నికలు దేశానికి సరిపోవని పలువురు మేధావులు అభిప్రాయ పడుతున్నతరుణంలో చంద్రబాబునాయుడు జమిలీ ఎన్నికలకు జై కొట్టారు. దీని వెనుక ఏమి జరిగి ఉంటుంది?


సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రం చెప్పినట్లు మాట్లాడుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎప్పుడూ జమిలీ ఎన్నికల గురించి మాట్లాడని చంద్రబాబు బుధవారం మాట్లాడారు. ఢిల్లీ నుంచి బుధవారం విజయవాడ చేరుకున్న చంద్రబాబు నాయుడు సాయంత్రం మీడియా వారితో మాట్లాడుతూ జమిలీ ఎన్నికల గురించి మాట్లాడారు. ప్రదాన మంచి పాలన అందిస్తున్నారని, విదేశీ సంబంధాల విషయంలోనూ మోదీ మంచిపేరు సంపాదించారని అభినందించారు. దేశంలో ఒక్కోచోట ఒక్కోరోజు ఎన్నికలు జరగటం వల్ల అభివృద్ధిపై దృష్టి సారించలేకపోతున్నామని, స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ఒకే సారి జరగటం మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

నరేంద్ర మోదీ జమిలీ ఎన్నికల గురించి అనేకసార్లు ప్రస్తావించారు. దీనిని విస్తృతంగా ప్రచారం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు నోటి నుంచి జమిలీ ఎన్నికల ప్రస్తావన వచ్చిందని చెప్పొచ్చు. రాష్ట్ర అభివృద్ధి అంశాల కంటే రాజకీయ అంశాల గురించి ఎక్కువగా చర్చించేందుకు మోదీని కలిసి ఉంటారనే అభిప్రాయాన్ని పలువురు రాజకీయ పరిశీలకు వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన తరువాత పలు అంశాలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ప్రధానంగా శ్రీ వెంకటేశ్వరస్వామి లడ్డు కల్తీ విషయం పెద్ద దుమారం లేపింపింది. ప్రతిపక్ష పార్టీ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన మంత్రికి లేఖ రాస్తూ ముఖ్యమంత్రే స్వయంగా లడ్డుకు వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని ప్రచారం చేయడాన్ని ఆక్షేపించారు. ఈ అంశాలను పరిశీలించాలని కోరారు. ప్రత్యేకించి లడ్డులో కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎంతమంది బాధ్యులు ఉన్నారో వారందరినీ వదిలేది లేదని చెబుతూ సిట్ ఏర్పాటు ఏర్పాటు చేశారు. సిట్ దర్యాప్తును వ్యతిరేకిస్తూ, చంద్రబాబు వ్యాఖ్యలపై సీబిఐ విచారణ కోరుతూ పలువురు సుప్రీ కోర్టును ఆశ్రయించారు. సుప్రీ కోర్టు రాష్ట్ర పోలీస్, కేంద్ర దర్యాప్తు సంస్థతో సంబంధం లేకుండా ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేసింది. చంద్రబాబు వ్యాఖ్యలను కూడా తప్పుపట్టింది. కోర్టు అక్షింతలు వేయడంతో ఆలోచనలో పడ్డ చంద్రబాబు ఢిల్లీ టూర్ పెట్టుకుని కేంద్ర బీజేపీ పెద్దలందరినీ కలిసారు. లడ్డు విషయంలో కాస్త పట్టు వదలాలని చంద్రబాబు పీఎం మోదీని కోరి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగినా ఈ విషయంలో ప్రధాన మంత్రి నోరు మెదపలేదు.

పీఎం ఆదేశాలతోనే జమిలీ ఎన్నికల విషయంలో బీజేపీకి టీడీపీ సపోర్టు చేస్తోందనే చర్చ మొదలైంది. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగితేనే మంచిదని చంద్రబాబు అన్నారంటే అది మోదీ పలికించిన మాటేనని చర్చ ఏపీలో మొదలైంది. జమిలీ ఎన్నికలు జరిగిన తరువాత ఏవైనా అవాంతరాల వల్ల ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు తిరిగి జరగాల్సి వస్తే ఐదేళ్ల తరువాతే జరుపుతారా? అప్పటి వరకు ఆ రాష్ట్రం కేంద్రంలోని ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తుందా? అంటూ పలువురు చర్చించుకోవడం విశేషం. సాధారణంగా రాష్ట్రానికి నిధులు కావాల్సిన విషయాన్ని ఎలాగూ అర్జీలు, ప్రతిపాదన రూపంలో కోరుతారు. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం ఎన్డీఏలో ఉన్నందున సానుకూలంగా స్పందిస్తుంది. దాని కోసం వెంటవెంటనే ఢిల్లీకి సీఎం వెళ్లాల్సిన అవసరం లేదనే చర్చకూడా మొదలైంది. చంద్రబాబు నాయుడు ఉన్నట్లుండి జమిలీ ఎన్నికల దుమారం ఆంధ్రప్రదేశ్ లో లేపారు. జమిలీ ఎన్నికలపై అన్ని పార్టీల వారు మాట్లాడే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో మరో చర్చ మొదలైందని చెప్పొచ్చు.

Read More
Next Story