శాఖాహారం తినే గుజరాత్‌లో గోద్రా అల్లర్లు ఎందుకు జరిగాయి
x

శాఖాహారం తినే గుజరాత్‌లో గోద్రా అల్లర్లు ఎందుకు జరిగాయి

ఈ మాట అన్నది ఎవరో కాదు. సాక్షాత్తు పవన్‌ కళ్యాణ్‌. గతంలో ఇలాంటి ఎన్నో మాటలు అన్నారు. ఆదర్శాలు పలికారు. నాడు ఆయన పలికిన మాటలు..వీడియోలు నేడు వైరల్‌గా మారాయి.


తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యితో తయారం చేడంతో హిందూ ధర్మానికి అపచారం జరిగితే ఇంట్లోనే ఉంటారా? కోపం రావడం లేదా? సనాతన ధర్మం కోసం ప్రాణాలైనా ఇస్తా అని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతున్న తరుణంలో మతం, కులం, బీఫ్‌ వంటి పలు అంశాలపై గతంలో ఆయన మాట్లాడిన మాటలు, వీడియోలు గత కొద్ది రోజులుగా వైరల్‌గా మారాయి. కులం, మతం, ప్రాంతం అనేవీ ఏమీ లేవని తాను వాటన్నింటికీ అతీతుడ్ని అని, ఆ సంకెళ్ల మధ్య తనను బంధించాలని చూస్తే అరికాలు నుంచి నడి నెత్త వరకు కోపం తన్నుకొని వస్తుందని పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడారు. పరిస్థితులు, ఆచార వ్యవహారాలకు తగ్గట్టుగా ఆహారపు అలవాట్లు ఉంటాయని తన పార్టీ శ్రేణులకు పవన్‌ కళ్యాణ్‌ ఉద్బోదించిన సూక్తులు నేడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఎనిమిదేళ్ల క్రితం తిరుపతిలో జరిగిన ఒక బహిరంగ సభలో పవన్‌ కళ్యాణ్‌ ఏం మాట్లాడారంటే ‘తెలుగుదేశం ప్రభుత్వం విధి విధానాలను రెండు సార్లు అడిగాను. రైతు భూములను ఆలోచించి తీసుకోండి అనగానే తనకు కులాన్ని, మతాన్ని అంటగట్టారు. యువతను పక్క దారి పట్టించేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నాలు చేస్తున్నారు. తను చుట్టూ కులం రంగు పులుముతున్నారు. నాకు ఎక్కడ కులం ఉంది. నాకెక్కడ మతం ఉంది. నా కూతురు క్రిస్టియన్‌ అబ్బా. నాకూతురు క్రిస్టియన్‌. నా కూతురు తల్లి తన మచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్‌ ఆర్థడాక్స్‌ చర్చిలో బాప్‌టైజ్డ్‌ చేయిస్తానంటే చేయించ మన్నాను. ఎందుకంటే నాకు భగవంతుడు ఏ రూపంలో ఉన్న ఒక్కడే భగవంతుడు. నేను పుట్టింది హిందూ మతంలో పుట్టాను. హిందూ ధర్మంలో పుట్టాను. నేను హిందూ దేవుళ్లను పూజిస్తాను. నా కూతురు క్రిస్టియానిటీలో పుట్టింది. జీసస్‌ను పూజిస్తుంది. దాని వల్ల నాకు ఏం తేడా లేదు. ఏం ఫరాక్‌ పడదు. ఎందుకంటే సర్వకులాలు నాకు ఒక్కటే. సర్వ మతాలు నాకు ఒక్కటే. సర్వ ప్రాంతాలు నాకు ఒక్కటే. అలాంటి నాకు కులం, మతం, ప్రాంతం అంటగట్టితే అరికాలు నుంచి నడినెత్తి వరకు నాకు కోపం వస్తది. మీరు నన్ను ఏదైన అనండి. కానీ నాకు కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ అంటగడితే, నేను వేరే వ్యక్తిని. అని వేలాది మంది తరలి వచ్చిన నిండు సభలో చప్పట్లు, ఈలల మధ్య పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగించారు.
గొడ్డు మాంసం గురించి గతంలో ముస్లీం వేషధారణతో తన పార్టీకి చెందిన ముస్లిం కార్యకర్తలతో మాట్లాడిన మరో వీడియో తాజాగా వైరల్‌గా మారింది. రీల్స్‌ రూపంలో చక్కర్లు కొడుతోంది. అందులో పవన్‌ కళ్యాణ్‌ ఏమి మాట్లాడారంటే ‘సంపూర్ణ మద్యపాన నిషేధం, బీఫ్‌ గురించి నాకు అనిపించింది. పూర్తి శాఖాహారం తింటే గొప్ప వాళ్ళైపోతారా? గుజరాత్‌ పూర్తి శాఖాహార రాష్ట్రం. అత్యంత మారణకాండ గోద్రా అల్లర్లు జరిగింది కూడా గుజరాత్‌లోనే. సో తిండి వల్ల మనుషులు మారి పోతారనేది తప్పు. అని మాట్లడగానే ముస్లిం సోదరులు చప్పట్లు చరస్తూ పవన్‌ కళ్యాణ్‌ని అభినందించారు. ఇంకా దానిని కొనసాగిస్తూ గాలి తీసుకుంటే క్రిములు చచ్చిపోతాయి. అవి చచ్చిపోకుండా ఉండాలంటే ముక్కుకు అడ్డంగా గుడ్డ కట్టుకోవాలి. మరి బట్టను నేయాలంటే కొన్ని క్రిములు చచ్చిపోవాలి. నిజంగా ముస్లీంలు లాగా నాకు గడ్డం పెంచుకుంటే నిజంగా సంతోషంగా ఉంటుంది. మనస్పూర్తిగానే ముస్లీంల మాదిరిగా గడ్డం పెంచుకోవడం అంటే నాకు ఇష్టం. ముస్లీంల మాదిరిగా వేషధారణతో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడారు. తలపైన టోపీ, భుజంపైన కండువా పెట్టుకున్నానని, ఇష్టంతోనే ఇలా పెట్టుకున్నానని మాట్లాడారు.
నాడు కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం గోమాంసం మీద దేశ వ్యాప్తంగా చర్చ సాగుతున్న సమయంలో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడిన మాటలివి. మతం, కులం, ఆహారపు అలవాట్లు వంటి కీలక అంశాలపై పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ వీటిని పట్టించుకోవలసిన అవసరం లేదు అని జనసేన పార్టీ కార్యకర్తలకు ఉద్బోదించారు. ‘నిజంగా గో మాంసం గురించి, బీఫ్‌ గురించి ఇంత గొడవ జరుగుతుంటే నిజంగా నాకనిపించింది.. స్వామి వివేకనంద ఒక మాట చెప్పారు. చిన్నప్పుడెప్పుడో మా నాన్న నాకు చెప్పిన మాటలివి. నిజంగా నాకు ఆకలేసి వేరే దారిలేక పోతే నేను బీఫ్‌ను తిని ముందుకెళ్తానే తప్ప దానిని వేరేలా చేసుకోను అని మాట్లారు. స్వామి వివేకానంద జీవిత చరిత్రలో ఈ మాటలు ఉంటాయి. అంటే తిండి ఏది తిన్నామనేది కాదు. అంటే శాఖాహారం తిని అందరు గొప్పోళ్లు అయిపోతారు అంటే మరి గుజరాత్‌లో గోద్రా ఘటన ఎందుకు జరిగిందని ప్రశ్నించారు.
Read More
Next Story