జగన్ ఆ సామాజికవర్గాన్ని ఎందుకు టార్గెట్ చేశారు!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో ఒక సామాజికవర్గాన్ని టార్గెట్ చేశారు. ఎందుకు చేశారు? దీని వెనుక ఏముంది?
రాజకీయాల్లో ఉన్న వారు పదవులే పరమావధిగా ఉంటారు. ఇల్లాలిని కూడా వదులుకోడానికి సిద్ధం.. కానీ పదవిని వదులుకోవడానికి సిద్ధంగా లేను అంటూ ఎన్నో సినిమాల్లో డైలాగులు విన్నాం. కొన్ని చోట్ల ప్రత్యక్ష్యంగా కూడా చూస్తున్నాం. అందుకే అంటారు రాజకీయ నాయకులను న మ్మొద్దని. ఆంధ్రప్రదేశ్ దశాబ్ధ కాలంగా కుల రాజకీయాల వేదికైంది. ఒక్కో పార్టీ ఒక్కో కులానికి పరిమితం అనే ముద్ర పడింది. అయితే ప్రజలు మాత్రం అలా లేరని 2024లో జరిగిన ఎన్నికలు నిరూపించాయి.
రాయలసీమలోని ఉమ్మడి జిల్లాలైన అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప, ఆ తరువాత కోస్తాకు అనుకుని ఉన్న నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మొదటి నుంచీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారి రాజకీయ ఆదిపత్యం కొనసాగుతూ వచ్చింది. ఇప్పటికీ ఈ జిల్లాల్లో రెడ్ల ఆదిపత్యమే ఎక్కువగా ఉంటుంది. కడప జిల్లాకు చెందిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నాకు ఈ ఆరు జిల్లాల్లో తిరుగులేని భావించారు. అందుకు 2014, 2019 ఎన్నికల్లో ఎక్కువ సీట్లు, ఓట్లు కూడా రావడం. ఈ ఓట్లు తన రాజకీయ జీవితానికి మైలు రాయిగా భావించారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో బీసీలు ఎక్కువగా ఉన్నారు. ఆ తరువాత ఎస్టీలు, ఎస్సీలు ఉన్నారు. విశాఖపట్నంలో కొన్ని ప్రాంతాల నుంచి వచ్చి స్థితిపడిన వారిలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. వీరిని తనవైపు తిప్పుకోవాలంటే రాజధాని మంత్రం మంచిదనుకున్నారు జగన్. అందుకే విశాఖపట్నం రాజధాని నగరం చేస్తున్నానని ప్రకటించారు. అక్కడి నుంచి పరిపాలన సాగించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు. అయినా సాధ్యం కాలేదు.
గోదావరి జిల్లాల్లో కాపు, ఎస్సీల ప్రాబల్యం ఎక్కువ. ఎస్సీల్లో ఎక్కువ మంది క్రిష్టియన్ మత విశ్వాసంతో ఉన్న వారు ఎక్కువ మంది. జగన్ కూడా క్రిష్టియానిటీపై అమితమైన నమ్మకం ఉన్న వారు అయినందున ఎస్సీ సామాజిక వర్గం వారు ఎక్కువ మంది జగన్‌ను అభిమానించారు. ఈ రెండు జిల్లాల్లోనూ పట్టుదలతో పనిచేస్తే రాజకీయంగా వైఎస్సార్‌సీపీకి తిరుగు ఉండదనే భావనకు వచ్చారు. అయితే అక్కడ ఎస్సీలతో పాటు కాపులకు కూడా పార్టీలో తగిన ప్రాధాన్యత ఇచ్చారు.
ఇక మిగిలింది కృష్ణా, గుంటూరు జిల్లాలు. ఈ రెండు జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారు. ఈ రెండు జిల్లాలోని కమ్మ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు తనను డామ్‌నేట్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఎలాగైనా ఈ సామాజిక వర్గాన్ని దెబ్బతీయాలనే ఆలోచన చేశారు. అందులో గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతం కొంత వరకు రెడ్ల ప్రాబల్యం ఉంది. కేవలం కొద్ది మంది మాత్రమే ఉన్న ఏరియాలో కమ్మ సామాజిక వర్గాన్ని దెబ్బ తీసేందుకు వైఎస్ జగన్ ఎన్ని ఎత్తులు వేయాలో అన్ని ఎత్తులు వేశారు. అందుకే ముందుగా అమరావతి అనేది లేకుండా చేయాలనే ఆలోచనకు వచ్చారు. అమరావతిలో ఒక్క రాయి పెట్టి గోడ కట్టినా తన గొయ్యి తాను తవ్వుకున్నట్లేనన్న భావనకు వచ్చారు. అందుకే అమరావతి ప్రాంతాన్ని నామ రూపాలు లేకుండా ఐదేళ్లలో చేయగలిగాడు.
పైగా ఈ రెండు జిల్లాల్లోని ఎస్సీల ఆనందం చూడాలనే ఉద్దేశ్యంతో విజయవాడ పట్టణం నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం నిర్మించారు. ఈ స్మృతి వనం అమరావతిలో నిర్మించాల్సి ఉంది. అక్కడ ఇటుక పెట్టలేదు కాబట్టి, దళితులు ఆరాధ్య దైవంగా భావిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ స్థాపన నగరం నడిబొడ్డున చేయించారు. ఇది దళిత వర్గాల్లో తన గ్రాఫ్‌ను పూర్తి స్థాయిలో పెంచుతుందని భావించారు. విషయం ఏమిటంటే అమరావతి ప్రాంతం ఉన్న నియోజకవర్గం తాడికొండ ఎస్సీ రిజర్వుడు. అంటే అక్కడ అన్ని కులాల వారికి ప్రాధాన్యత ఉందనే విషయం కూడా జగన్ మరిచారనే వాదన కూడా ఉంది.
ఎవరైతే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే ఆలోచనల్లో ఉన్నారో వారిని కూడా వదలతేదు. ప్రధానంగా అధికారులు. రాజకీయ నాయకులు ఉన్నారు. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టగానే మొదటి వేటు ఇంటిలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరావుపై పడింది. ఐదేళ్ల కాలం సస్సెన్షన్‌లో ఉండేలా చేశారు. ఉద్యోగ విరమణ రోజు విధుల్లో చేరి పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. అలాగే రాష్ట్ర ఎన్నికల అధికారిగా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ముప్పు తిప్పలు పెట్టారు. అయినా ఆయన ఎదురొడ్డి నిలబడ్డారు. ఆయనపై కూడా కమ్మ సామాజిక ముద్ర వేసి పిచ్చి వాడిని చేసే ప్రయత్నం జరిగిందనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఎన్‌వి రమణ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందుతున్నారన్న సమయంలో ఆయనకు ఆ పదవి ఇవ్వడం మంచిది కాదని ఏకంగా ప్రధానమంత్రికి లేఖ అందించారు. అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి కొన్ని అంశాలతో కూడిన కంప్లైంట్‌ను పంపించారు. ఇదే లేఖను తనకు ప్రత్యేక సలహాదారుగా ఉన్న అజేయకల్లాంతో ప్రెస్‌మీట్ పెట్టించి మాట్లాడించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై కూడా పరోక్ష విమర్శలు చేశారు. తెలుగు భాష ప్రాభవం కోల్పోకుండా చూడాలని ఇంగ్లీష్ మీడియం చదువుల గురించి వెంకయ్యనాయుడు మాట్లాడినప్పుడు మీ మనుమళ్లు, మనుమరాళ్లు ఎక్కడ చదువుతున్నారు. కూతుళ్లు ఎక్కడ చదివారు. అంటూ సెటైర్లు వేసి కొంత హేళనగా మాట్లాడారు. ఇక మార్గదర్శి చిట్స్‌పై కేసులు వేయించి రామోజీరావును అరెస్ట్ చేయించే ప్రయత్నం కూడా చేయించారు.
ఎవరైతే ఈనాడు ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చల్లో పాల్గొన్న కమ్మ వారు ఉన్నారో వారిపై కూడా వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ద్వారా సెటైర్లు వేయించారు. సుమారు పది మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు సోషల్ మీడియా బాధితులు ఉన్నారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెడుతున్నారని సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబును కూడా అరెస్ట్ చేయించారు. ఈయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కావడమేనని అప్పట్లో ప్రచారం సాగింది. ఇక చంద్రబాబు నాయుడు, సీపీఎం రాఘవులు, సీపీఐ నారాయణ వంటి వారిని వదలకుండా కమ్మ సామాజికవర్గాన్ని దెబ్బ తీసేందుకు రాష్ట్రాన్ని దోచుకునే ఘరానా దొంగలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారనే విమర్శలు వెల్లువెత్తాయి.
మొత్తం మీద ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ ఆదిపత్యంలో భాగంగానే కమ్మ సామాజికవర్గాన్ని దెబ్బతీయాలనే ఆలోచనలు చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు విజయవాడను రాజధాని చేయాలనే ఎక్కువ మంది కమ్యూనిస్టులు పట్టుపట్టగా కర్నూలును రాజధాని చేయాలని కాంగ్రెస్‌లోని ఎక్కువ మంది రెడ్లు పట్టుపట్టారు. చివరకు కర్నూలు రాజధాని అయింది. అటువంటి ఆలోచనలే జగన్‌లోనూ ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట.
Next Story