చంద్రబాబు పవన్ కల్యాణ్ ను ఎందుకు కలుస్తున్నట్టు?
x

PAWAN KALYAN & CHANDRABABU

చంద్రబాబు పవన్ కల్యాణ్ ను ఎందుకు కలుస్తున్నట్టు?

చిరంజీవిపై బాలకృష్ణ వ్యాఖ్యల నేపథ్యంలో ఈభేటీకి ప్రాధాన్యత


జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికొద్ది సేపట్లో పరామర్శించనున్నారు. నాలుగు రోజులుగా పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ లోని ఇంటిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆదివారం హైదరాబాద్ రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నివాసానికి సీఎం వెళ్లనున్నారు. వైరల్ ఫీవర్‌ (Viral fever)తో ఇబ్బంది పడుతున్న పవన్‌ను పరామర్శించనున్నారు.
అలాగే, తాజా రాజకీయ పరిణామాలపై వీరి మధ్య చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. జ్వరంతోనే ఇటీవల ఏపీ అసెంబ్లీకి, తన శాఖలపై సమీక్షలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అనంతరం వైద్యులు పవన్ కల్యాణ్‌‌కు వైద్యం అందించారు. వైద్యులకు చూయించిన జ్వరం తగ్గక పోవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ చూపించుకున్నారు. ఈ క్రమంలో పవన్‌ని పరామర్శించనున్నారు సీఎం చంద్రబాబు.
ఈ సమయంలోనే ఆయన ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలనూ చర్చించనున్నట్టు సమాచారం. బాలకృష్ణ చిరంజీవిపైన, జగన్ పైన చేసిన వ్యాఖ్యలనూ ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తోంది.
చిరంజీవి చెప్పినవి అబద్ధాలని, జగన్ ను సైకో అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. దీనిపై ప్రస్తుతం రాష్ట్రంలో దుమారం చెలరేగుతోంది. మరోపక్క చిరంజీవి అభిమానుల సంఘం నాయకులు ఇవాళ చిరంజీవి బ్లడ్ బ్యాంకులో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను చర్చించనున్నట్టు సమాచారం. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
Read More
Next Story