బైబిల్‌ను నాలుగ్గోడల మధ్య ఎందుకు..బయటికొచ్చి చదవచ్చు: సీఎం చంద్రబాబు
జగన్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం. తిరుమలలో రూల్స్ అలా ఉన్నాయన్న సీఎం చంద్రబాబు
బైబిల్ రూంలోనే ఎందుకు చదువుకోవాలి, బయట కూడా చదువుకోవచ్చు కదా అని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమల పర్యటన రద్దు చేసుకున్న మాజీ సీఎం జగన్ మీడియా ఎదుట చేసిన వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి బదులిచ్చారు. ఎవరైనా తిరుమల వచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తామంటే కుదరదన్నారు. ఇష్టం లేకపోతే తిరుమల వెళ్లొద్దున్నారు. వెళ్లినప్పుడు అక్కడి సంప్రదాయాలు పాటించాలన్నారు. తిరుమలలో రూల్స్ ఆ విధంగా ఉన్నాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ రూల్స్ పాటించి తీరాలన్నారు.
తిరుమల వెళ్లొద్దని జగన్ కు ఎవరూ నోటీసులు ఇవ్వలేదన్నారు. ర్యాలీలు, జన సమీకరణలు చేయవద్దని చెప్పామన్నారు. నిబంధనలు పాటించకపోతే మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వస్తుందన్నారు. ఇంతకుముందు నిబంధనలు అతిక్రమించాడని, ఇప్పుడు కూడా నిబంధనలు మళ్లీ అతిక్రమించాలా? ప్రశ్నించారు. ఇంతకుముందు మీరు చట్టాన్ని ధిక్కరించి, బెదిరించి ఆలయం లోపలికి వెళితే, అది శాశ్వత అధికారం అవుతుందా? అన్నారు. రౌడీయిజం చేస్తాం అంటే కుదరదన్నారు.ఇప్పటిదాకా నన్నెవరు ఇలా అడగలేదు, ఇప్పుడెందుకు అడుతున్నారు అనడం సమంజసం కాదన్నారు.నేను హిందువుని, వెంకటేశ్వరస్వామి వద్దకు వెళతాను. నేను బహిరంగంగానే పూజలు చేస్తాను అన్నారు. అలాగే చర్చికి వెళతాను, వాళ్ల నియమాలను, నిబంధనలను పాటిస్తాను. అదేవిధంగా మసీదుకు వెళతాను, వాళ్ల ఆచారాలను గౌరవిస్తాను అన్నారు.