మొంథా తుపాన్ పేరు ఎవరు పెట్టారంటే
x

'మొంథా' తుపాన్ పేరు ఎవరు పెట్టారంటే

భారత వాతావరణ శాఖ ప్రకారం 'మొంథా' తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90–100 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది, గరిష్టంగా 110 కి.మీ. వేగం వరకు చేరవచ్చని అంచనా.


థాయ్ భాషలో 'మొంథా' అంటే "సుగంధమైన" లేదా "అందమైన పువ్వు" అని అర్థం. 'మొంథా' తుపానుకు బంగ్లాదేశ్ పేరు పెట్టింది. తుఫానులకు పేర్లు పెట్టడానికి ఒక పద్ధతి ఉంది, దీని ప్రకారం ప్రపంచ వాతావరణ సంస్థ (World Meteorological Organization) ఆధ్వర్యంలో 13 దేశాల కూటమి ఈ పేర్లను సూచిస్తుంది. తుఫానులు వచ్చినప్పుడు, ఈ జాబితాలోని దేశాలు తమ వంతుగా పేర్లను అందిస్తాయి.

మొంథా ప్రభావం ఇలా
మొంథా తుపాను ప్రధానంగా భారతదేశంలోని తూర్పు తీరప్రాంతం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిషా, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలను ప్రభావితం చేస్తుంది. ఈ తుపాను అక్టోబర్ 28న సాయంత్రం లేదా రాత్రి సమయంలో కాకినాడ సమీపంలో, మచిలీపట్నం, కళింగపట్నంల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90–100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి, 110 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, తమిళనాడులోని తీర ప్రాంత జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. తుపాను కారణంగా సముద్రంలో అలలు ఉధృతంగా ఉంటాయి. కాబట్టి మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. మొంథా తుపాను ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. దీనివల్ల ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.
రెడ్ అలెర్ట్
బాపట్ల, వైఎస్సార్, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నంద్యాల, చిత్తూరు, పల్నాడు, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాకినాడ, గోదావరి జిల్లాలు, ఏలూరు జిల్లాలలో తీరం దాటే సమయంలో అత్యంత తీవ్రమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అధికారులు కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి, నష్టాన్ని తగ్గించడానికి సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు.
Read More
Next Story