చంద్రబాబుకు ప్రాణహానీ ఉందని ట్వీట్ చేసిన ఈ చైతన్య ఎవరు?
x

చంద్రబాబుకు ప్రాణహానీ ఉందని ట్వీట్ చేసిన ఈ చైతన్య ఎవరు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రాణహానీ ఉందని ట్వీట్ చేసిన వ్యక్తి ఎవరు? ఎందుకు చేశారు? అనే దానిపై రాష్ట్ర పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రాణహానీ ఉందని ట్వీట్ చేసిన వ్యక్తి ఎవరు? ఎందుకు చేశారు? అనే దానిపై రాష్ట్ర పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ట్వీట్ వచ్చి వారం రోజులు దాటిపోయింది. ఇప్పటి వరకు అది పోలీసుల దృష్టికి పోలేదు. ఇప్పుడది వాళ్ల దృష్టిలో పడడంతో పోలీసు శాఖలో కలకలం మొదలైంది. చంద్రబాబుకి ప్రాణహాని ఉందంటూ సోషల్ మీడియాలో ఓ అంగతకుడు ఈనెల 4న సోషల్ మీడియా ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. తిరుమల బ్రహ్మోత్సవాల తొలిరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు సతీ సమేతంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్టు చేస్తూ... చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించడం దేవుడికి సైతం ఇష్టం లేనట్లు ఉందని, కచ్చితంగా ప్రాణహానీ ఉందని ట్వీట్ చేశాడు.

తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్న ఆ వీడియోపై టీటీడీ సీరియస్ అయ్యింది. దీనిపై తిరుపతి వన్ టౌన్ పోలీసులకు టీటీడీ అధికారులు ఫిర్యాదు చేశారు. బ్లైండ్ మ్యాన్ అనే ఖాతా నుంచి ఈ వీడియో పోస్ట్ అయింది. చైతన్య అనే వ్యక్తి ఈ వీడియో పెట్టారు. సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించడానికీ ప్రాణహానీకి సంబంధమేమిటో తెలియడం లేదని, అసలు అలా ఎందుకు కామెంట్ చేయాల్సి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల ఫిర్యాదు మేరకు ఐపీసీ 196, 298, 299, 353(2) సెక్షన్ల కింద తిరుపతి వన్ టౌన్ పోలీసులు కేసు పెట్టారు. ఈ చైతన్ ఎవరు, ఎందుకు పోస్ట్ పెట్టారు, దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే అంశంపై దర్యాప్తు ప్రారంభించారు.

చంద్రబాబుకు ఈ తరహా బెదిరింపులు ఇంతకు ముందు కూడా వచ్చాయి. అయితే ఎప్పటికప్పుడు పోలీసులు రంగంలోకి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారి భరతం పడుతూ వచ్చారు. వైసీపీ హయాంలోనూ ఇలాంటి బెదిరింపులు వచ్చాయి.
తిరుపతి అలిపిరి వద్ద నక్సలైట్లు బాంబు పేల్చి చంద్రబాబు హత్యకు ప్లాన్ చేసిన తర్వాత ఆయన భద్రత పెరిగింది. వైసీపీ పాలనలో ఆయన భద్రతను కుదించడం, దానిపై వివాదం చెలరేగడం, వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది.
టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆయన భద్రత మళ్లీ పూర్వ స్థితికి వచ్చింది. అయినా ఇటువంటి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. దీని వెనుక సూత్రధారులు ఎవరనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.


Read More
Next Story