జగన్ ను - స్ డీకే అన్నదెవరు? ఎందుకన్నారు?
x

జగన్ ను '- స్ డీకే' అన్నదెవరు? ఎందుకన్నారు?

'బోస్ డీకే' అన్న పదం మళ్లీ తెరపైకి వచ్చింది. 2021 అక్టోబర్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్దేశించి అన్నారు.


ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. బూతు వ్యవహారాలు ఎక్కువవుతున్నాయి. 2021 అక్టోబర్ లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తూ టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ జగన్ ను బోషిడీకే అన్నారు. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఒక్కసారిగా మండి పడ్డాయి. పట్టాభిరామ్ ఇంటిపై దాడి చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అది కాస్త ఘర్షణకు దారితీసి రాళ్లు రువ్వుకోవడం వరకు వెళ్లింది. ఆ ఘర్షణలో వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు.

ఇంతకు ఎందుకు బోషిడీకే అనాల్సి వచ్చిందని చాలా మంది జర్నలిస్ట్ లు అప్పట్లో పట్టాభిని ప్రశ్నించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక వేదికపై మాట్లాడుతూ పట్టభి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. తిరిగి బుధవారం గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ మళ్లీ ప్రస్తావించారు. ఇంతకూ బోషిడీకే అంటే అర్థం ‘లంజాకొడక’ అని జగన్ అన్నారు. ఈ విధమైన మాటలు మాట్లాడటం తెలుగుదేశం వారికి తగుతుంది. నన్నుఅభిమానించే వారు ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఆ నాడు నన్ను పట్టాభి మాట్లాడిన మాటలకు నేను ఏమి చేయాలి. చేయని తప్పులకు తప్పుడు కేసుల్లో ఇరికించి మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను జైలుకు పంపించారని అన్నారు.

‘బోషిడీకే’ అన్న పథానికి పట్టాభి చెప్పిన అర్థం వేరుగా ఉంది. పలు మీడియా సంస్థలతో మాట్లాడుతూ నేను బోషిడీకే అన్నాను. దాని అర్థం జగన్ చెబుతున్నది కాదు. ఈ పదం సినిమాల్లోనూ చాలా సార్లు వాడారు. హైదరాబాద్ లో కామన్ గా వాడతారు. బోషిడీకే అంటే బుద్దిలేనోడా.. తెలివి తక్కువోడా... వెర్రిబాగులోడా.. అని అంతే కాని జగన్ చెబుతున్న అర్థం కాదు. అందుకే నేను ఆరోజు అన్నానని చెప్పారు. తప్పుడు కేసుల్లో ఇరికించి పార్టీ క్యాడర్ ను భయపెట్టాలని చూస్తున్నారు. అధికారం ఉందికదా అని ఏదైనా చేస్తే సరిపోదని ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అన్నారు.

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేషన్ ను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ చేశారు. రిమాండ్ కు వెళ్లారు. మాజీ మంత్రి జోగి రమేశ్ పై కూడా కేసు నమోదైంది. విచారణకు పిలిచినా ఆయన వెళ్లటం లేదని, ముఖ్య మంత్రి చంద్రబాబు ఇంటిపై ఆయన ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు జోగి రమేశ్ దాడి చేశారని, దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని టీడీపీ వారు అంటున్నారు. ఈ పరిణామాల్లో కొన్నింటిని పలకరిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్ బోషిడీకే అన్నం పదం గురించి గుంటూరులో మరోసారి ప్రస్తావించారు. చేసిన తప్పులు చేసి ఇప్పుడు తిరిగి వైఎస్సార్సీపీ వారిపై కేసులు పెట్టడం ఏమిటని ఆయన టీడీపీ వారిని ప్రశ్నించారు. ఇలా బోషిడీకే పథం తిరిగి తెరపైకి వచ్చింది.

Read More
Next Story