
పదిలో ఏ జిల్లా టాప్ అంటే
అత్యంత తక్కువ ఉత్తీర్ణత సాధించిన అల్లూరి సీతారామరాజు జిల్లా ఆఖరు స్థానంలో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాలలో ఏ జిల్లా ఏ స్థానంలో నిలిచిందనేది ఆసక్తికరంగా మారింది. పార్వతీపురం మన్యం జిల్లా అన్ని జిల్లాల కంటే అత్యధిక పాస్ పర్సేంటేజీ సాధించి అగ్ర స్థానంలో నిలవగా దాని పక్కనే ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా అన్ని జిల్లాల కంటే తక్కువ ఫలితాలను సాధించి అఖరు స్థానంలో నిలిచింది.
పార్వతీపురం మన్యం జిల్లా 93.90 శాతం ఉత్తీర్ణత సాధించింది. దీనిలో బాలికలదే హవా నడిచింది. బాలురు 92.17 శాతం సాధిస్తే, బాలికలు 95.55 శాతం ఉత్తీర్ణత సాధించి తమకు తిరుగులేదని నిరూపించారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, విశాఖపట్నం జిల్లాలు తర్వాత రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. కోనసీమ జిల్లా 91.43 ఉత్తీర్ణతతో రెండో స్థానంలోను, విశాఖపట్నం జిల్లా 89.14 శాతం ఉత్తీర్ణతతో మూడో స్థానంలో నిలిచాయి. తర్వాత 88.53 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా, 88.44 శాతంతో అనకాపల్లి జిల్లాలు నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి.
తూర్పు గోదావరి జిల్లా 87.99 శాతం, విజయనగరం జిల్లా 87.04శాతం, ఎన్టీఆర్ జిల్లా 85.68 శాతం, ప్రకాశం జిల్లా 85.43 శాతం, కృష్ణా జిల్లా 85.32 శాతం, పల్నాడు జిల్లా 84.15శాతం, బాపట్ల జిల్లా 83.96, నెల్లూరు జిల్లా 83.58 శాతం ఉత్తీర్ణత సాధించి తర్వాత స్థానాల్లో నిలిచాయి.
ఇక శ్రీకాకుళం జిల్లా 82.41 శాతం, కాకినాడ జిల్లా 82.24 శాతం, పశ్చిమ గోదావరి జిల్లా 82.15శాతం, నంద్యాల జిల్లా 81.85శాతం, కడప జిల్లా 80.78 శాతం, తిరుపతి జిల్లా 79.83, అన్నమయ్య జిల్లా 77.61 శాతం, ఏలూరు జిల్లా 77.24శాతం, శ్రీ సత్యసాయి జిల్లా 74.79శాతం, అనంతపురం జిల్లా 70.07 శాతం, చిత్తూరు జిల్లా 67.06 కర్నూలు జిల్లా 66.01శాతంతో తర్వాత స్థానాల్లో నిలవగా, 47.64 శాతం ఉత్తీర్ణతతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఆఖరు స్థానంలో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి ఫలితాలను విడుదల చేసింది. మంత్రి నారా లోకేష్ బుధవారం 10 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 81.14 శాతం ఉత్తీర్ణత సాధించింది. దీనిలో బాలికలే ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు. బాలురు 78.31 శాతం ఉత్తీర్ణత సాధిస్తే, బాలికలు 84.09 ఉత్తీర్ణత సాధించారు.
Next Story