Pushpa-2|పుష్ప-2 బెనిపిట్ షో డబ్బులు ఎక్కడకు పోతున్నాయి ?
x

Pushpa-2|పుష్ప-2 బెనిపిట్ షో డబ్బులు ఎక్కడకు పోతున్నాయి ?

మమూలు టికెట్ మహాయితే 200 రూపాయలుంటే బినిఫిట్ షో పేరుతో 800 రూపాయలు టికెట్ ధర పెట్టి జనాలను దోచేసుకుంటున్నారంటు ఆరోపణలు పెరిగిపోతున్నాయి.


పుష్ప-2 సినిమా టికెట్ ధరల విషయంమీద బాగా వివాదాలు పెరిగిపోతున్నాయి. గతంలో ఏ సినిమాకు లేనట్లుగా పుష్ప-2 సినిమాకు నిర్మాతలు అనుకున్నట్లుగా టికెట్ ధరలు పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం(Rvanthreddy Government) అనుమతిచ్చింది. దీనిపైన మామూలు జనాలు తీవ్రస్ధాయిలో మండిపోతున్నారు. రెగ్యులర్ రిలీజ్ 5వ తేదీకన్నా ముందు మల్టీప్లెక్సు(Multiplex)ల్లో బెనిఫిట్ షో(Benefit Shows)లు వేస్తున్నారు. ఈ బెనిఫిట్ షోలకు టికెట్ కొనాలంటే రు. 800 చెల్లించాల్సిందే. అంటే ప్రతిటికెట్టును నిర్మాతలు 800 రూపాయలకు అమ్ముకుంటున్నారు. మమూలు టికెట్ మహాయితే 200 రూపాయలుంటే బినిఫిట్ షో పేరుతో 800 రూపాయలు టికెట్ ధర పెట్టి జనాలను దోచేసుకుంటున్నారంటు ఆరోపణలు పెరిగిపోతున్నాయి.

ఇదే విషయమై సతీష్ అనే వ్యక్తి హైకోర్టు(High Court)లో పిటీషన్ వేశాడు. బెనిఫిట్ షో పేరుతో పుష్పా-2కి ఒక టికెట్ రు. 800కి అమ్మటం అన్యాయమని చెప్పారు. బెనిఫిట్ షో పేరుతో నిర్మాతలు వసూలుచేసుకుంటున్న డబ్బంతా ఎక్కడికి పోతోంది అని అడిగారు. ఈ విషయాలు తెలుసుకునేందుకే తాను కోర్టులో కేసువేసినట్లు చెప్పిన సతీష్ సినిమా రిలీజును నిలిపేయాలని కోర్టును కోరారు. పిటీషనర్ వేసిన కేసులో లాజిక్ ఉన్నప్పటికీ చివరినిముషంలో సినిమా రిలీజును అడ్డుకోలేమని జడ్జి చెప్పారు. సినిమా రిలీజుకు క్లియరెన్సు ఇచ్చిన కోర్టు పిటీషనర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని నిర్మాతలకు నోటీసులు జారీచేయాలని ఆదేశించారు. టికెట్ ధరల పెంపుకు సంబంధించిన జీవోలను కూడ పరిశీలిస్తామని చెప్పిన జడ్జీ తర్వాత విచారణను డిసెంబర్ 17వ తేదీకి వాయిదా వేశారు. పిటీషనర్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని నిర్మాతల తరపు లాయర్ ను జడ్జి ఆదేశించారు. బెనిఫిట్ షోల ద్వారా వసూలు అవుతున్న డబ్బులను ఏమి చేయబోతున్నారనే విషయాన్ని కూడా స్పష్టంచేయాలని కోర్టు నిర్మాతల తరపు లాయర్ ను ఆదేశించింది.

సినిమాను భారీ బడ్జెట్ తో తీశారు కాబట్టి టికెట్ ధరలు పెంచాల్సొచ్చిందని నిర్మాతల లాయర్ చెప్పారు. అయితే పిటీషనర్ తరపు లాయర్ జోక్యం చేసుకుని టికెట్ల ధరలు పెంచటం వల్ల అభిమానులపై ఆర్ధికభారం పడుతోందన్నారు. సినిమా లెంగ్త్ కూడా 3.30 గంటలని పిటీషనర్ లాయర్ చెప్పారు. టికెట్ ధరలు పెంచటం వల్ల వసూలు అయ్యే మొత్తం సీఎం సహాయనిధికి, ఏదైనా ఛారిటీకీ వెళ్ళటంలేదని పిటీషనర్ లాయర్ చెప్పారు. ఇదే సమయంలో జడ్జి జోక్యం చేసుకుని పదిమంది కలిసి సినిమా చూడాలంటే రు. 8 వేలు అవుతుందన్నారు. బెనిఫిట్ షో హీరో అభిమానులకు మాత్రమే అని మామూలు జనాలకు కాదని నిర్మాత లాయర్ వివరించారు. అన్నీ విషయాలు 17వ తేదీ విచారణలో తెలుస్తయని జడ్జి విచారణను ముగించారు.

Read More
Next Story