
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఎప్పుడు ప్రకటించారంటే
నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ పెద్దలు ఎన్టీఆర్ మీద సామదాన దండోపాయాలను ప్రయోగించారు. అయినా ఎన్టీఆర్ డోంట్ కేర్ అన్నారు.
నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టడం, అలా పార్టీ నెలకొల్పిన అనతి కాలంలోనే ఊహించని రీతిలో అధికారాన్ని కైవసం చేసుకోవడం, దక్షిణాదిలోనే కాకుండా యావత్ భారత దేశంలోనే ఎన్టీఆర్ ఒక ప్రభంజనం సృష్టించడం కూడా అందరికీ తెలిసిన విషయాలే. టీడీపీ అంటే వెంటనే మైండ్‌లోకి వచ్చే మరొక విషయం ఏంటంటే.. హోటల్ వైశ్రాయ్ ఇన్‌సిడెంట్. టీడీపీని ఎన్టీఆర్ చేతుల్లో నుంచి తన చేతుల్లోకి లాక్కునేందుకు నారా చంద్రబాబు నాయుడు ఆడిన గేమ్, టీడీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు తనవైపు తిప్పుకోవడం, తన బొమ్మ పెట్టుకొని గెలిచిన ఎమ్మెల్యేలను పిలిచేందుకు వెళ్లిన ఎన్టీఆర్ మీదే చెప్పులు, రాళ్ళు వేయడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంఘటన కూడా ప్రపంచానికి తెలిసిన అంశమే.
కానీ ఎన్టీఆర్ రాజకీయాలలోకి వస్తున్నట్టు బయట ప్రపంచానికి ఎప్పుడు తెలిసింది.. ఎలా తెలసింది.. తొలుత ఎప్పుడు ప్రకటించారనే విషయాలు చాలా కొద్ది మందికే తెలుసు. అంత ప్రాముఖ్యత కలిగిన ఒక చిన్న చిట్ చాట్‌లో వెలుగులోకి వచ్చిందనే విషయం బహుశా కొద్ది మందికే తెలిసి ఉంటుంది. తాను రాజకీయాల్లోకి రావాలనుకుంన్నట్లు నాడు ఎన్డీఆర్ ప్రకటించి ఇప్పటికి 45 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఈ అంశం సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
సరిగ్గా 45 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు చెప్పారు. ఇది బహిరంగ ప్రకటన కాదు. పది మందిలో చెప్పిన విషయమూ కాదు. ఒకరిద్దరితో పంచుకున్న విషయం. అంత్యంత రహస్యంగా జరిగిన ఓ చిన్న పాటి చర్చ లాంటి కార్యక్రమం. అయితే అది చివరికి చిలవలు, పలవలుగా మారి తెలుగు ప్రపంచానికి చేరువైంది. తెలుగు ప్రజల్లో ఇది పెద్ద ఎత్తున చర్చకు దారి తీయడంతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లను పరుగెత్తించింది. ఎన్టీఆర్ ఇంకా రాజకీయాల్లోకి రాకముందే.. పార్టీ పెట్టక ముందే నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. అప్పటికి ఇంకా వరుస సినిమాలతో ఫుల్ బిజీగాను, మార్కెట్‌లోను టాప్‌లో ఉన్న ఎన్టీఆర్ ఎక్కడో మాట్లాడిన మాటలు కరుడు కట్టిన కాంగ్రెస్ పెద్దలకు లిటరల్‌గా వెన్నులో వణుకు పుట్టించింది. అప్పటికే స్టార్ డమ్‌తో ఓ రేంజ్‌లో తెలుగు చలన చిత్ర పరిశ్రమను సింగిల్ హ్యాండ్‌తో శాసిస్తున్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారనే వార్త నాటి రాజకీయ పెద్దలకు మింగుడు పడవని అంశంగా మారింది.
ఒక వేళ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే తమకు పుట్టగతులు ఉండవు, తమ పప్పులు ఇంక ఉడకవు, ప్రజలంతా ఎన్టీఆర్ వెనుకాలే వెళ్తారు, దీంతో రాజ్యం ఏలడానికి తమకు అవకాశం ఉండదని భావించిన నాటి కాంగ్రెస్ పెద్దలు ఎన్టీఆర్ సినిమాలపై దృష్టి సారించారు. సినిమాల పరంగా ఇబ్బందులు పెడితే.. ఎన్డీఆర్ భయపడి పోతారని, రాజకీయాల ఊసే ఎత్తరని భావించారు. కానీ ఎన్టీఆర్ వాటిని డోండ్ కేర్ అన్నట్టుగా వ్యవహరించారు. దీంతో కాంగ్రెస్ పెద్దలకు రాజకీయాలలోకి రాకుండా ఎన్టీఆర్‌ను నిలువరించాలంటే ఏమి చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడ్డారు. ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆయనను రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునేందుకు. కానీ అవేమీ ఎన్డీఆర్ రాజకీయ ఎంట్రీని అడ్డుకోలేక పోయాయి.
ఎన్టీఆర్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు తొలుత ప్రకటించింది 1980లో. అది బహిరంగంగా కాదు. సరిగ్గా అది ఎన్టీఆర్‌కు మంచి పేరును తెచ్చి పెట్టిన సర్థార్ పాపారాయుడు సినిమా తెరకెక్కెతున్న సమయం. ఊటీలో సర్థార్ పాపారాయుడు సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో ఎన్టీఆర్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చిన విలేకరులతో చిట్ చాట్ నిర్వహించారు. అలా విలేకరులతో ముచ్చటిస్తున్న సమయంలో ఎన్టీఆర్ ఒక కీలక తూటాల్లాంటి వ్యాఖ్యలు చేశారు. తనకు 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేయాలని ఉందని.. ఇన్నాళ్లు తనను, తన సినిమాలను ఆదరించిన నాటి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలని తనకు ఉందని.. దీని కోసం రాజకీయాల్లోకి రావాలని ఉందని ఎన్టీఆర్ మాట్లాడారు. అది చిన్నగా ఆ నోటా.. ఈ నోటా పడి తెలుగు పత్రికలలోకి ఎక్కింది. దీంతో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క సారిగా రాజకీయ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి.
దీంతో అప్పటి పాలకులకు గుండెల్లో రైళ్లు పరుగెత్తడం మొదలైంది. అప్పటి వరకు అనేక సినిమాల్లో నటించినా,, అర్జునుడు, కృష్ణుడు, వంటి పౌరాణిక పాత్రల్లో నటించి తెలుగు ప్రజల గుండెల్లో అర్జునుడు గాను, కృష్ణుడిగాను నిలిచి పోయారు. అంత ప్రజల ఆకర్షణ కలిగిన నటుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పాలన అంతమైపోయినట్లే అని భావించారు. దీంతో ఎన్టీఆర్‌ను కట్టడి చేసేందుకు ఆయన బాల్య స్నేహితుడైన భవనం వెంకట్రాంను ముఖ్యమంత్రిని చేసి రంగంలోకి దింపారు. ఇక ఎన్టీఆర్ పై సామదాన దండోపాయాలను ప్రయోగించడం మొదలు పెట్టింది. భవనం వెంకట్రాం ద్వారా ఎన్టీఆర్‌ను దారిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు.
ఎన్టీఆర్ సినిమాలను సెన్సార్ బోర్డు ద్వారా ఏదో మెలిక పెట్టి ఆపేందుకు కుట్రలు పన్నారు. కానీ ఎన్టీఆర్ కాంగ్రెస్ ఉడత ఊపులకు అదిరిపోలేదు..బెదిరి పోలేదు. తన సినిమాలు తాను చేసుకుంటూ ముందుకు సాగారు. మరో వైపు ఎన్టీఆర్‌తో సినిమాలు తీసేందుకు ఆ సయమంలో నిర్మాతలు ఎగబడ్డారు. రాజకీయాల్లోకి వెళ్తారన్న వార్తలు వచ్చినప్పటికీ ఎన్టీఆర్‌తో సినిమాలు తీసేందుకు ఎవరు సంకోచించలేదు.. వెనకడుగు వేయలేదు.
ఇలా ప్రయాణం సాగుతున్న సయమంలో సర్థార్‌పాపారాయుడు సినిమా షూటింగ్ సమయంలో ఊటీలో ఎన్టీఆర్ చెప్పిన ప్రకారం 1982 మార్చి 21న హైదరాబాద్‌లోని తన రామకృష్ణా స్టుడియోస్‌లో మినీ ప్రివ్యూ థియేటర్‌లో జర్నలిస్టుల సమక్షంలో నందమూరి తారక రామారావు తన రాజకీయ రంగ ప్రవేశం ప్రకటన వెల్లడించారు. అలా ఎన్టీఆర్ తన రాజకీయ ఎంట్రీ గురించి ప్రకటించి మొన్న మార్చి 21 నాటికి 43 ఏళ్లు పూర్తి అయ్యాయి. అలా ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ టీడీపీ నెలకొల్పడం, దానిని చంద్రబాబు నాయుడు లాక్కోవడం వంటి అనేక అంశాలపై నెట్టింట్లో పెద్ద చర్చగా మారింది.
Next Story