చంద్రబాబు 2019లో దిగిపోయేనాటికి బకాయిలు ఎంతంటే?
x

చంద్రబాబు 2019లో దిగిపోయేనాటికి బకాయిలు ఎంతంటే?

తాజాగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జగన్‌ మాట్లాడుతూ 2019లో దిగిపోయే నాటికి చంద్రబాబు వదిలి వెళ్లిన బకాయిలను జగన్‌ వివరించారు.


చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో వదిలి వెళ్లిన బకాయీలను మాజీ సీఎం జగన్‌ వివరించారు. 2014–2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు 2019లో దిగిపోయే నాటికి వేల కోట్ల బకాయిలను పెట్టి పోయారని తెలిపారు. బడ్జెట్‌పై బుధవారం జగన్‌ మాట్లాడుతూ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రతీ ప్రభుత్వం హయాంలో చెల్లించాల్సిన బిల్లులు, బకాయిలు ఉంటాయి. ఇది సర్వసాధారణం. అయితే అవి కొంత మేరకే ఉంటాయి. పెద్ద మొత్తాల్లో ఉండవు. తర్వాత సంవత్సరం వాటి చెల్లింపులు జరిగి పోతుంటాయి. కానీ చంద్రబాబు నాయుడు దిగిపోతూ తమకు వేల కోట్ల బిల్లులు బకాయిలుగా వదిలి వెళ్లారని జగన్‌ అన్నారు.

ఒక్క పవర్‌ కంపెనీకి కూడా డబ్బులు ఇవ్వ లేదన్నారు. డిస్కమ్‌ లయబులిటీ రూ. 21541 కోట్లు బకాయిలు పెట్టారని విమర్శించారు. ఉపాధి హామీ బకాయిలు రూ. 2340 కోట్లు, ఉద్యోగులకు రెండు డీఏలు, ఆరోగ్యశ్రీ బకాయిలు రూ. 2800 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, విత్తన బకాయిలు, క్రాప్‌ ఇన్సూరెన్స్‌ బకాయిలు, మధ్యాహ్న భోజనం ఆయాలకు కూడా బకాయిలు పెట్టి వెళ్లారని విమర్శించారు. ఇలా అన్నీ కలిపి ఏకంగా రూ. 42183 కోట్ల బకాయిలు పెట్టి చంద్రబాబు నాయుడు 2019లో దిగిపోయారని అన్నారు. ఎవరూ కూడా ఈ స్థాయిలో బకాయిలు పెట్టరని అన్నారు. అప్పులు కూడా చంద్రబాబు హయాంలోనే ఎక్కువ చేశారని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ. 1.30లక్షల కోట్లు అప్పు ఉంటే, 2019లో ఆయన దిగిపోయే నాటికి రూ. 3.13లక్షల కోట్లు అప్పులు చేశారని, అంటే 19.4శాతం అప్పులు చేశారని తెలిపారు.


Read More
Next Story