జగన్ భవిష్యత్తు గురించి పంచాంగం ఏం చెబుతోంది!
x

జగన్ భవిష్యత్తు గురించి పంచాంగం ఏం చెబుతోంది!

జగన్ భవిష్యత్తు గురించి పంచాంగం ఆసక్తికర విషయాలను అంచనా వేస్తోంది. అందులో ఆయన మరోసారి సీఎం అవుతారా లేదా అన్న అంశాలు కూడా ఉన్నాయి.


ఉగాది పండగ వచ్చిందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సీఎంకు ప్రత్యేక పూజలు నిర్వహించి పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఇందులో ఈ ఏడాది రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండనుందని పండితుల ద్వారా తెలుసుకుంటారు. దానికి తగ్గట్టుగా వారు తమ ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణను ప్లాన్ చేసుకుంటారు. ఇదే ఎన్నో ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ ఏడాది ఉగాది నాడు సీఎం జగన్ దంపతులు పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. కాగా ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం నిర్వహించలేదు. ఈ నేపథ్యంలోనే పలువురు పండితులు ఈ ఏడాది పంచాంగం ఏం చెబుతోందో వివరించారు. అందులో సీఎం జగన్ భవితవ్యాన్ని కూడా వివరించారు. మరి ఇంతకీ జగన్‌కు ఈ ఏడాది జరగనుందంటే..

సీఎం భవిష్యత్తు ఇలా!

‘సీఎం జగన్‌ది మిథున రాశి, ఆర్ద్ర నక్షత్రం. ఈ రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. దాంతో పాటు ప్రతిపక్ష నాయకుడి జాతకం కూడా చూసుకోవాల్సి ఉంటుంది. జగన్ జాతకాన్ని చూస్తే.. కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్‌ బలమైన పోటీని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి’’అని ఒక పండితుడు వివరించారు. మరోకరైతే రానున్న ఎన్నికల్లో జాతకరీతయా చూసుకుంటే మరోసారి సీఎం అయ్యే అవకాశాలు జగన్‌కు చాలా స్వల్పంగా ఉన్నాయని, జాతకరీత్యా జగన్‌ కన్నా ప్రతిపక్ష నాయకుల జాతకాలు, గ్రహాలు బలంగా ఉన్నాయని, ఎన్నికల సమయానికి జగన్ జాతకంలో కష్టాలు మరిన్ని పెరుగుతాయని, కావున ఆయన సీఎం అయ్యే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువని మరి కొందరు పండితులు చెప్తున్నారు. మరి పండితులు వేస్తున్న అంచనా ఎంత మేరకు ఫలిస్తుందో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.




Read More
Next Story