సెస్, ట్యాక్స్‌కు మధ్య తేడా ఏమిటి?
x

సెస్, ట్యాక్స్‌కు మధ్య తేడా ఏమిటి?

ఈ మధ్య ప్రభుత్వం విధించే వివిధ రకాల పన్నుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సెస్, ట్యాక్స్‌కు మధ్య తేడా ఏమిటో తెలుసా?


రాష్ట్ర ప్రభుత్వం రకరకాల పన్నులు విధిస్తోంది. పన్ను, సెస్‌ల మధ్య అర్థాలు ఒకటిగా ఉన్నా వీటి మధ్య తేడాలు ఉన్నాయి. సెస్‌ అంటే సుంకం. ట్యాక్స్‌ అంటే పన్ను. కొత్తగా మద్యం పాలసీ అమలులోకి వచ్చింది. ఈ పాలసీ ప్రకారం ప్రైవేట్‌ వ్యక్తులు షాపులు నిర్వహిస్తారు. ఆ షాపుల్లో మద్యం కొనుగోలు చేసే వ్యక్తులు కొనుగోలుపై రెండు శాతం సెస్‌ చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని కారణంగా మద్యం ధరలు కాస్త పెరిగే అవకావం ఉంది.

సెస్‌ అంటే సంరక్షణ, దేశాల మధ్య వాణిజ్యానికి సంబంధించి ఆర్థిక అంశాలతో ముడిపడి ఉంటాయి. ఎగుమతి చేసే వస్తువలపై సుంకం విధిస్తారు.
ట్యాక్స్‌ అంటే ఒక వ్యక్తి ఆదాయంలో చెల్లించాల్సిన భాగం, ఇది ప్రత్యక్ష పన్ను విభాగంలోకి వస్తుంది.
నిధి జమ చేయడం అంటే..
ఒక వ్యక్తి నుంచి వసూలు చేసిన పన్ను ఖజానాకు జమ అవుతుంది. ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించిన నిధుల్లో సమకూరతాయి. ఆయా విభాగాల నుంచి ప్రభుత్వం సేకరించిన పన్నులన్నీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిర్ధిష్ట నిధులకు తరలిస్తారు. అక్కడి నుంచి బడ్జెట్‌ ప్రకారం వివిధ ప్రాజెక్టు, పనులకు నిధులను ప్రభుత్వాలు ఖర్చు చేస్తాయి. కానీ సెస్‌ ద్వారా సేకరించిన నిధులను మాత్రం ఒకే ప్రయోజనం కోసం మాత్రమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
తేడా ఏమిటి?
ప్రత్యక్ష, పరోక్ష పన్నులు అమల్లో ఉన్నాయి. ఇప్పుడు దేశంలో గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ అమలులోకి వచ్చింది. ఆదాయపు పన్ను, కార్పొరేషన్‌ పన్ను, వ్యక్తులు, సంస్థల పన్నులు వసూలు చేస్తున్నారు. కృషి కళ్యాణ్‌ పథకం, స్వచ్ఛ భారత్‌ సెస్, విద్యా ఆరోగ్య సంరక్షణ సెస్‌ కోసం నిర్ధిష్ట పథకాన్ని ప్రవేశపెట్టారు. పన్ను, సెస్‌ ప్రయోజనంలో తేడా ఉండదు. పన్ను అంటే ఒక వ్యక్తి లేదా సంస్థ ఆదాయంపై విధించే మొత్తంగా కాగా, సెస్‌ అంటే విదేశాలతో వాణిజ్యానికి సంబంధించిన అంశం. వస్తువుల ఎగుమతి, దిగుమతికి సంబంధించి సుంకం విధిస్తారు. దీనిని పంపించే దేశం విధిగా చెల్లించాల్సి ఉంటోంది.
నిర్ధిష్ట పథకాన్ని ప్రోత్సహించేందుకు సెస్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. విద్య, ఆరోగ్యానికి సంబంధిచిన సెస్‌ స్థానంలో 2018 బడ్జెట్‌లో విద్యా సెస్, సెకండరీ, ఉన్నత విద్యను 4 శాతంతో భర్తీచేశారు. దేశంలో గ్రామీణ ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చ డానికి ఆరోగ్య, విద్యా సెస్‌ ప్రవేశపెట్టారు. ఇచ్చిన వ్యక్తికి లెక్కించిన పన్ను మొత్తంలో చెల్లించాల్సిన మొత్తమే సెస్‌.
Read More
Next Story