అమరావతిలో జోన్స్‌ గోలేమిటి?
x

అమరావతిలో జోన్స్‌ గోలేమిటి?

ఏపీ రాజధాని అమరావతిలో జోన్స్‌ ఏర్పాటు, అమలుపై వివాదాలు ఉన్నాయి. ఈ వివాదాలు ఎందుకు? ఈ స్పెషల్‌ జోన్స్‌ ఎందుకు ఏర్పాటు చేశారు.


రాజధాని అమరావతి ప్రాంతంలో సీఆర్‌డీఏ నాలుగు ప్రత్యేక జోన్స్‌ ఏర్పాటు చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2022లో ఐదో ప్రత్యేక జోన్‌ను ఏర్పాటు చేసి అక్కడ పేదలకు పట్టాలు ఇచ్చింది. దీనిపై వివాదం మొదలైంది. ఒక వర్గం హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలకు ముందు ఎలాగైతే ఉందో అలాగే ఉంచాలని హైకోర్టు స్టేటస్‌ కో జారీ చేసింది. అప్పటి ప్రభుత్వం ఈ విషయంలో సుప్రీ కోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పు వెలువడాల్సి ఉంది.

ప్రత్యేక జోన్స్‌ ఏమిటి?
రిజర్వుడు జోన్స్‌గా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ జోన్స్‌ ఏమిటి? ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. విజయవాడ గుంటూరు నగరాల్లోని పేదలకు ఇళ్లస్థలాల పట్టాలు ఇచ్చేందుకు ఆర్‌5 జోన్‌ను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలో 900.97 ఎకరాల మేర పేదల ఇళ్ల కోసం జోనింగ్‌ ఏర్పాటు చేసింది. ఆర్‌5 జోన్‌ను ఏర్పాటు చేస్తూ 2022 అక్టోబరులోనే ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం సరికాదని, జీవోను వ్యతిరేకిస్తూ రాజధానికి భూములు ఇచ్చిన కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు.
అమరావతి ప్రణాళిక ప్రకారం 4 నివాస జోన్లు ఉండేవి. ఆర్‌1 అంటే.. ప్రస్తుత గ్రామాలు, ఆర్‌2 అంటే తక్కువ సాంద్రత గృహాలు, ఆర్‌3 అంటే తక్కువ నుంచి మధ్యస్థాయి సాంద్రత కలిగిన గృహాలు, ఆర్‌4 అంటే హైడెన్సిటీ జోన్‌ పేర్లతో 4 రకాల నివాస జోన్లు ఉండేవి.
ఆర్‌5 జోన్‌ను ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది?
పేదలు అనేక మందికి ఇండ్ల స్థలాలు లేవని, రాజధానికి దగ్గరగా పేదలకు ఇంటి పట్టాలు ఇస్తే వారి జీవితాలు బాగుంటాయనే ఆలోచనలో గత ప్రభుత్వం సుమారు 50వేల మందికి ఇంటిస్థలాల పట్టాలు ఇచ్చింది. ఇది అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు నచ్చలేదు. ప్రస్తుతం ఉన్న గ్రామాలు తప్ప వేరే ప్రాంతాల వారికి అమరావతిలో ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇచ్చేందుకు వీలు లేదని అల్టిమేటమ్‌ ఇచ్చారు. వివాదం కోర్టులో ఉంది.
2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు, ప్రత్యేకంగా సంస్థలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే వారికి, ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తామని చెప్పింది. ఆ మేరకు నాలుగు జోన్స్‌ మొదట ఏర్పాటు చేసింది. అయితే చంద్రబాబు చేసిన నిర్ణయాన్ని ఎలాగైనా మార్చేయాలనే ఉద్దేశ్యంతో ఐదో జోన్‌ను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి మరో వివాదానికి కారణమైంది. దీంతో రాజధానిలో జోన్స్‌ సమస్య మొదలైంది.

ఆర్5 జోన్ గోల గురించి సీఎం చంద్రబాబునాయుడు మంట్లాడుతూ ప్రస్తుతానికి అమరావతిలో రెస్టోర్ చేయాల్సిన పనులన్నీ పూర్తి చేయాలని, ఆర్5 జోన్ విషయం కోర్టులో ఉన్నందున దాని గురించి తరువాత మాట్లాడదామని చెప్పారు. ఈ జోన్ లో పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలు వేరే ప్రాంతాల్లో ిఇవ్వాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భూ సమీకరణ సాధ్యం కాకుంటే భూ సేకరణ ద్వారా తీసుకుని గతంలో పట్టాలు ఇచ్చిన వారికి తిరిగి భూమి సేకరించిన ప్రాంతంలో పట్టాలు ఇవ్వాలని ఆదేశించారు.

Read More
Next Story