25వేల కిలోల డ్రగ్స్  కేసు ఏమైంది.. ప్రశ్నించిన మాజీ మంత్రి
x

25వేల కిలోల డ్రగ్స్ కేసు ఏమైంది.. ప్రశ్నించిన మాజీ మంత్రి

ఈ ఏడాది మార్చిలో విశాఖ పోర్ట్ లభ్యమైన 25 వేల కిలోల డ్రగ్స్ కేసు పురోగతిపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కేసు వివరాలు వెల్లడించాలని కోరారు.


22 మార్చి 2024న దేశమంతా విశాఖ పోర్ట్‌వైపు చూసింది. అందుకు కారణం ఆరోజు విశాఖ పోర్టుల లభించిన 25వేల కిలోల డ్రగ్స్. అంతమొత్తంలో డ్రగ్స్ లభించడం సామాన్య ప్రజలే కాదు.. ఉన్నతాధికారులను కూడా ఒంకింత ఆశ్చర్యానికి గురి చేసింది. దీని గుట్టు తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అందులో భాగంగానే డ్రగ్స్ కంటైనర్‌ను ఇంపోర్ట్ చేసుకున్న సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్స్ సంస్థపై దృష్టిపెట్టారు. ఆ సంస్థ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఇంతవరకే ఈ కేసుకు సంబంధించిన వివరాలు వచ్చాయి. ఒక్కసారిగా ఈ కేసు ఏమైందో తెలియదు. ఎవరికీ అంతుచిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఈ అంశాన్ని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ లేవనెత్తారు. దేశమంతా సంచలనం సృష్టించిన 25వేల కిలోల డ్రగ్స్ కేసు ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికల ముందు ఈ డ్రగ్స్ పట్టుబడటంతో అందరూ వైసీపీపై తీవ్ర నిందలు మోపారని, కానీ ఇప్పుడు ఆ కేసు ఎందుకు కనుమరుగైపోయిందో ఎవరూ చెప్పడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా ఈ కేసు అంశాన్ని పార్లమెంటులో ఆంధ్ర ఎంపీలు లేవనెత్తాలని పిలుపునిచ్చారు. ఇందులోని వాస్తవాలను ప్రజలకు తెలపాలని కోరారు.

ఎప్పుడూ ఇలాంటి మచ్చలేదు..

విశాఖ పోర్ట్‌పై ఎప్పుడూ ఇలాంటి మచ్చలేదని, గతంలో ఎన్నడూ కూడా డ్రగ్స్ దిగమతి అనేది ఇక్కడ జరగలేదని బొత్స వ్యాఖ్యానించారు. ‘‘గుజరాత్, మహారాష్ట్ర నుంచి డ్రగ్స్ రావడం అనేకసార్లు చూశాం. విశాఖలో అలా ఎప్పుడూ జరగలేదు. కానీ ఎన్నికల ముందు కనీవినీ ఎదరుగని రీతిలో ఒకేసారి 25వేల కిలోల డ్రగ్స్ ఒకే కంటైనర్‌లో లభించాయి. అదే సరైన సమయంగా భావించిన రాజకీయ ప్రత్యర్థులు వైసీపీని టార్గెట్‌గా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ ఎన్నికల ముందు రాజకీయా ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉండకూడదని భావించి పెదవి కూడా విప్పలేదు. ఇప్పటికి కూడా ఎవరిపైనో ఆరోపణలు, విమర్శలు చేయడానికి ఈ విషయం లేవనెత్తడం లేదు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలన్న ఉద్దేశంతోనే అడుగుతున్నాం’’ అని చెప్పారు.

‘ఆ నివేదికను బహిర్గతం చేయాలి’

ఈ కేసు అంశాలతో పాటు టీడీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన భూ కుంభకోణాలపై వేసిన సిట్ నివేదికను బహిర్గతం ఎందుకు చేయట్లేదని బొత్స ప్రశ్నించారు. ‘‘2014-2019 మధ్య భూ కుంభకోణాలపై టీడీపీ సర్కార్ వేసిన సిట్ బృందం అందించిన నివేదికను బహిర్గం చేయాలి. వైసీపీ హయాంలో వేసిన సిట్ నివేదికను ఒత్తిళ్ల కారణంగా విడుదల చేయలేదు. ఈ విషయంపై సిట్‌ను ఓపెన్ చేయాలని మా ప్రభుత్వాన్ని కూడా అడిగాం. కానీ వీలుపడలేదు. భీ ఆక్రమణల నిగ్గు తేల్చాలి’’ అని పిలుపునిచ్చారు.

Read More
Next Story