
ఆపరేషన్ సింధూర్ అర్థమేమిటీ, పేరు పెట్టిందెవరు?
ఆపరేషన్ సింధూర్.. ఇప్పుడీ పేరో సంచలనం.. ఇంతకీ ఈ పేరు ఎవరు పెట్టారు, దీనర్థం ఏమిటీ
ఆపరేషన్ సింధూర్.. ఇప్పుడీ పేరో సంచలనం.. ఇంతకీ ఈ పేరు ఎవరు పెట్టారు, దీనర్థం ఏమిటీ, పాకిస్తాన్ లోని ఉగ్రవాద మూకల శిబిరాలకు ఈ పేరుకు సంబంధం ఏమిటీ.. దేశవ్యాప్తంగా మార్మోగుతున్న ఈ పేరు వెనకున్న నేపథ్యం ఏమిటంటే..
పాకిస్తాన్ లోని టెర్రరిస్టు మూకలపై భారత సైన్యాలు మే 7 వతేదీ తెల్లవారు జామున 1.44 గంటలకు దాడులు మొదలు పెట్టాయి. ఆ దాడులకు పెట్టిన పేరు ఆపరేషన్ సింధూర్. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఏప్రిల్ 28న ఉగ్రవాదులు హిందువులను ఎంచుకుని చంపారు. చాలా మంది మహిళలను వితంతువులుగా చేశారు. ఒక నవవధువు భర్తను ఆమె ముందే కాల్చి చంపారు. ఉగ్రవాదులు ఆ మహిళతో 'వెళ్లి మోదీకి చెప్పు' అన్నారు.
ఈ దాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్య తీసుకుంటామని చెప్పారు. ఉగ్రవాదుల సూత్రధారులకు గట్టి సమాధానం చెప్పామని అన్నారు. ఈరోజు పాకిస్తాన్‌లో 9 స్థావరాలపై దాడి చేసినప్పుడు దానికి 'ఆపరేషన్ సిందూర్' అని పేరు పెట్టారు. ఈ పేరును ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా పెట్టినట్లు కథనాలు వెలువడుతున్నాయి. మన మహిళలు భర్తలను కోల్పోయారు.. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని భారత్ ఎక్కడున్నా వదిలిపెట్టదు అనేలా మన ప్రతిస్పందన కచ్చితంగా కనిపించాలి అని ప్రధాని అధికారులకు స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో సేదదీరుతున్న పర్యాటకులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా జంటల్లో పురుషులను వేరు చేసి.. వారిని మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఉగ్రమూక టార్గెట్ చేసిన జంటల్లో అప్పటికి ఆరు రోజుల క్రితమే పెళ్లైన నవవధూవరులు వినయ్ నర్వాల్, హిమాన్షి ఉన్నారు. టెర్రరిస్టులు వినయ్‌ను హత్య చేయగా.. అతడి మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదిస్తున్న హిమాన్షి చిత్రం దేశం మొత్తాన్ని కదిపేసింది. వినయ్ నేవీ అధికారి కూడా. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా దీని చూడొచ్చు. యోధులకు పెట్టే వీరతిలకం అనే అర్థం కూడా దీనిలో ఉంది.
పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన సంతోష్ జగదాలే భార్య ప్రగతి జగదాలే ఆపరేషన్ సిందూర్‌పై మాట్లాడుతూ, "దీనికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే పీఎం మోదీ పాకిస్తాన్‌కు మేం కూడా మౌనంగా ఉండమని చూపించారు." అని పేర్కొన్నారు.
అదే సమయంలో, ఉగ్రదాడిలో మరణించిన కౌస్తుభ్ గణబోటే భార్య సంగీత గణబోటే ఆపరేషన్ సింధూర్‌పై మాట్లాడుతూ, "వీరు చేసిన చర్య ఖచ్చితంగా సరైనది. ఆపరేషన్‌కు సింధూర్ అని పేరు పెట్టడం ద్వారా మహిళలకు గౌరవం ఇచ్చారు." అని వ్యాఖ్యానించారు.
పహల్గామ్ దాడిలో కాన్పూర్‌కు చెందిన 31 ఏళ్ల వ్యాపారి శుభమ్ ద్వివేది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య ఐశాన్యా ద్వివేది వివాహం జరిగి రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. ఆమె ఆ భయంకరమైన రోజును గుర్తు చేసుకుంటూ తన బాధను వ్యక్తం చేసింది. ఒక కొత్త ఆశ, గర్వంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
ఈ ఆపరేషన్‌ను త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో నిర్వహించాయి. కశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదానికి కారణమైన లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థల కీలకమైన క్యాంప్‌లను నేలమట్టం చేశాయి.
Next Story