కుష్టు వ్యాధిపై సుప్రీం కోర్టు ఏమి చెప్పిందంటే
x

కుష్టు వ్యాధిపై సుప్రీం కోర్టు ఏమి చెప్పిందంటే

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎన్డీఆర్ యూనివర్శటీ సవరణ బిల్లును ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.


2025 సెప్టెంబరు 18 నుంచి సెప్టెంబరు 27 వరకు జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో డాక్టర్ ఎన్.టి.ఆర్. యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (సవరణ) బిల్లు 2025 ను ప్రవేశపెట్టారు. 1986 చట్టంలోని కుష్టురోగం (లెప్రసీ) వికలాంగులపై డిస్క్రిమినేటరీ పదాలు తొలగించడానికి అనుమతులు కోరుతూ దీనిని ప్రవేశపెట్టారు. ఈ బిల్లును సుప్రీం కోర్టు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC), కేంద్ర సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖ (MoSJE) సిఫార్సులు, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ (RPwD) యాక్ట్, 2016 ప్రకారం ఈ బిల్లు రూపొందింది. లెప్రసీ బాధితులు, వికలాంగులు వైద్య, విద్య, ఉద్యోగాలు, సమాజంలో సమాన అవకాశాలు పొందేలా ఈ సవరణ దారి తీస్తుంది. 2025 అక్టోబరు 3 న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం దీనికి ఆమోదం కూడా తెలిపింది.

బిల్లును ఎందుకు ప్రవేశపెట్టారు..ప్రాధాన్యత
ఈ సవరణ బిల్లు ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం 1986 చట్టంలోని పాత, డిస్క్రిమినేటరీ పదాలు ("deaf-mute or suffering from leprosy") ఉండటం. ఆధునిక వైద్య జ్ఞానం ప్రకారం లెప్రసీ పూర్తిగా చికిత్స చేయదగిన వ్యాధి (మల్టీ-డ్రగ్ థెరపీతో మొదటి డోస్‌తోనే నియంత్రణలోకి వస్తుంది). కుష్టు అనేది అంటువ్యాధి కాదు. అయినప్పటికీ, చట్టాలు ఈ బాధితులపై వివక్ష చూపుతున్నాయి. NHRC 2022లో 97 చట్టాల్లో డిస్క్రిమినేషన్ తొలగించమని సిఫార్సు చేసింది. MoSJE 2023 అక్టోబర్‌లో ఈ చట్టంలో సవరణలు చేయమని సూచించింది. RPwD యాక్ట్, 2016 ప్రకారం వికలాంగులపై డిస్క్రిమినేషన్ నిషేధం ఉంది.
బిల్లు ప్రాధాన్యత మానవ హక్కులు, సమానత్వం. ఇది లెప్రసీ బాధితులు, వారి కుటుంబాలు, వికలాంగులు (వినికిడి, మాట్లాడటం సమస్యలున్నవారు) సమాజంలో ఇంక్లూసివ్‌గా జీవించేలా చేస్తుంది. దేశవ్యాప్తంగా 20 చట్టాలు (ఏపీలో) ఇలాంటి సవరణలకు గురైనాయి. ఈ బిల్లు NHRC, MoSJE సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వానికి చట్టపరమైన, నైతిక బాధ్యతను నెరవేరుస్తుంది.
కుష్టు రోగం పై సుప్రీం కోర్టు
లెప్రసీ డిస్క్రిమినేషన్‌పై మొదటి ప్రధాన పిటీషన్ విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ వర్సెస్. యూనియన్ ఆఫ్ ఇండియా (రైట్ పిటీషన్ సివిల్ నెం. 13/2018) ద్వారా 2018లో దాఖలు చేయబడింది. ఇందులో ఎన్నికలు, ఉద్యోగాలు, విద్యలో లెప్రసీ బాధితులపై వివక్ష చూపే చట్టాలను సవరించమని కోరారు. లెప్రసీ బాధితులు, వారి పిల్లలపై డిస్క్రిమినేషన్‌ను కూడా సుప్రీం కోర్టు ముందు ఉంచారు.
సుప్రీం కోర్టు 2018లో ఈ పిటీషన్‌లపై తీర్పు ఇచ్చింది. "లెప్రసీ పూర్తిగా చికిత్స చేయదగిన వ్యాధి అని, ఇది అంటువ్యాధి కాదు అని పేర్కొంది. కుష్టు వ్యాధి సాకుతో వివక్ష చూపడం డిస్క్రిమినేటరీ చట్టాలు ఆర్టికల్ 14 (సమానత్వం), 21 (జీవన హక్కు) ఉల్లంఘన" అని వ్యాఖ్యానించింది. 2025 మే 8న మరో తీర్పులో రాష్ట్రాలకు "డిస్క్రిమినేటరీ చట్టాలను గుర్తించి, తక్షణమే సవరించమని" ఆదేశించింది.
NHRC సిఫార్సులు
2022 జనవరి 14న NHRC "లెప్రసీ బాధితులపై డిస్క్రిమినేషన్ తొలగించడానికి గుర్తింపు, చికిత్స, పునరావాసం" అడ్వైజరీ జారీ చేసింది. "97 చట్టాల్లో డిస్క్రిమినేషన్ తొలగించమని, సవరణలు చేయమని" సిఫార్సు చేసింది. ఆమేరకు ఎన్ హెచ్ ఆర్ సీ కేంద్రం, రాష్ట్రాలకు లేఖ రాసింది. "లెప్రసీ బాధితులు, కుటుంబాలపై సామాజిక వివక్షను అంతం చేయాలి" అని సూచించింది.
MoSJE సిఫార్సులు
కేంద్ర సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖ 2023 అక్టోబర్ 13న లేఖ ద్వారా, "లెప్రసీ, వికలాంగులపై ప్రత్యక్ష/పరోక్ష డిస్క్రిమినేషన్ చూపే చట్టాలు (డాక్టర్ ఎన్.టి.ఆర్. యూనివర్సిటీ చట్టం సహా) సవరించమని" సిఫార్సు చేసింది. ఇది RPwD యాక్ట్‌కు అనుగుణంగా 108 సవరణలు ప్రతిపాదించింది. లెప్రసీ బాధితులు "లోకోమోటర్ డిసేబిలిటీ" కేటగిరీలో చేర్చబడ్డారు, కానీ డిస్క్రిమినేటరీ పదాలు తొలగించాలని నొక్కి చెప్పింది.
బిల్లు వల్ల రోగులకు ప్రయోజనాలు
ఈ సవరణ వల్ల లెప్రసీ బాధితులు యూనివర్సిటీ బోర్డుల్లో సభ్యులుగా నియమించబడి, వైద్య విద్యా నిర్ణయాల్లో పాల్గొనవచ్చు. వైద్య పద్ధతుల్లో రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్స్‌గా అర్హులవుతారు, ఉద్యోగాలు, విద్యలో సమాన అవకాశాలు పొందుతారు. సామాజిక వివక్ష తగ్గి, పునరావాసం, చికిత్స సదుపాయాలు మెరుగవుతాయి. కుటుంబాలపై స్టిగ్మా తగ్గుతుంది, ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమైన జీవితం జీవించొచ్చు. ఈ చట్ట సవరణ దేశవ్యాప్తంగా లెప్రసీ బాధితుల ఉద్యమానికి మైలురాయి. "సమానత్వం, ఇంక్లూసివ్ సొసైటీ"ని ప్రోత్సహిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
Read More
Next Story