ఆంధ్ర ఎన్నికల్లో నిలబడుతున్న వారిలో వీరే సంపన్నులేమో!
x

ఆంధ్ర ఎన్నికల్లో నిలబడుతున్న వారిలో వీరే సంపన్నులేమో!

ఆంధ్రలో నామినేషన్లు వరుసగా దాఖలవుతున్నాయి. ఇప్పటివరకు అన్ని పార్టీల తరపున నామినేషన్‌లు వేసిన వారిలో అత్యధిక ధనికులు వీరే..


ఆంధ్రలో ఎన్నికల హడావుడి జోరుగా సాగుతోంది. అన్ని పార్టీల నేతలు ఒకరి తర్వాత ఒకరుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. భారీ ర్యాలీతో నామినేషన్ల స్వీకరణ కేంద్రానికి వెళ్లి నామినేషన్లు వేస్తున్నారు అభ్యర్థులు. నామినేషన్లలో ప్రతి అభ్యర్థి తన ఆస్తులు, నేర చరిత్ర ఇలా అన్ని విషయాలను తెలపాల్సి ఉంటుంది. ఈ నామినేషన్ల ప్రకారం ఇప్పటివరకు ఆంధ్రలో నామినేషన్లు దాఖలు చేసిన వారిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. భవిష్యత్తులో ఈ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో కానీ ప్రస్తుతానికయితే ఆయనదే అగ్రస్థానం. ఆ తర్వాత వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకా ఉన్నారు. ఈమెదే రెండో స్థానం. వీరి ఆస్తి వివరాలు ఎలా ఉన్నాయంటే..

వేమిరెడ్డి ఆస్తులెంతంటే

నామినేషన్ అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తులు రూ.715.62 కోట్లు. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేరుతో రూ.76.35 కోట్లు, ప్రభాకర్ రెడ్డి పేరుతో రూ.639.26 కోట్లు ఉన్నట్లు వారు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వాటితో పాటుగా వివిధ బ్యాంక్ అకౌంట్లలో రూ.1.17 కోట్లు ఉన్నాయి. అవికాక షేర్లు, బాండ్ల రూపంలో రూ.10.62 కోట్లు ఉన్నాయి. వీరిద్దగ్గర రూ.6.96 కోట్ల విలువైన 19 కార్లున్నాయి. నేర చరిత్ర విషయానికి వస్తే ప్రశాంతి రెడ్డిపై ఎటువంటి కేసులు లేవు.

బుట్టా రేణుకా ఆస్తులు ఇలా

బుట్టా రేణుక.. కొన్ని రోజులుగా తెగ వార్తల్లో నిలుస్తున్న వైసీపీ అభ్యర్థి ఈమె. ఆమె ఆస్తుల విషయమే ఈ వైరల్‌ కావడానికి కారణం. ‘బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే’ అని సీఎం జగన్ ఇటీవల వ్యాఖ్యానించారు. దాంతో ఆమె ఆస్తుల విలువ ఎంత అనేది రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారింది. వీటికి నిన్న ఆమె దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్ ఫుల్‌స్టాప్ పెట్టింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నామినేషన్లు వేసిన వారిలో అత్యధిక ధనవంతుల్లో ఆమెది రెండో స్థానం. అఫిడవిట్ ప్రకారం ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ.161.21 కోట్లు. వీటిలో చరాస్తులు రూ.142.46 కోట్లు కాగా స్థిరాస్తులు రూ.18.75 కోట్లు. ఇవి ఆమె, ఆమె భర్త శివ నీలకంఠ పేరిట ఉన్నాయి. వీరికి రూ.7.82 అప్పులు ఉన్నాయి.

మూడో స్థానంలో శిల్పా చక్రపాణి రెడ్డి

అత్యధిక ఆస్తులు ఉన్న వారి జాబితాలో మూడో స్థానంలో కూడా వైసీపీ అభ్యర్థే ఉన్నారు. శ్రీశైలం వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి ఆస్తుల విలువ పదేళ్లలో భారీగా పెరిగింది. అఫిడవిట్ ప్రకారం.. ఆయన, ఆయన సతీమణి, కుమారుడు ముగ్గురి పేరిట రూ.131..71 కోట్లు ఆస్తి ఉంది. వీరి పేరిట రూ.28.24 కోట్ల అప్పులు ఉన్నాయి. వీరి ఆస్తి 2014లో రూ.49.89 కోట్లుగా ఉండగా 2019 నాటికి రూ.10 కోట్లకు పైగా తగ్గి రూ.37.27 కోట్లు మాత్రమే ఉంది. అటువంటి ఈ ఐదేళ్లలో వారి ఆస్తులు దాదాపు వంద కోట్లు పెరిగింది.

Read More
Next Story