ఎస్కే యూనివర్శిటీలో అక్రమాలను వెలికి తీస్తాం
x

ఎస్కే యూనివర్శిటీలో అక్రమాలను వెలికి తీస్తాం

ఎస్కే యూనివర్శిటీ అక్రమాలపై ఏపీ శాసనసభలో చర్చ జరిగింది. విచారణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి లోకేశ్‌ తెలిపారు.


ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ (ఎస్కే యూనివర్సిటీ)లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయనే దాని పై శుక్రవారం తీవ్ర చర్చ జరిగింది. మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ, ఈ అక్రమాలపై విచారణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కమిటీ 100 రోజుల్లో నివేదిక సమర్పించాలి, కమిటీ ఆదేశిస్తామని, నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు ఎంఎస్‌ రాజు, పల్లె సింధురా రెడ్డి ఎస్కే యూనివర్సిటీలో అక్రమాల గురించి ప్రశ్నలు సంధించారు. దీనికి సమాధానమిస్తూ మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడారు. ఆయన 2019–2024 మధ్య వైసీపీ పాలనలో ఎస్కే యూనివర్సిటీలో జరిగిన అక్రమాలను వివరించారు. ముఖ్యంగా కంప్యూటర్ల కొనుగోలులో దుర్వినియోగం, యూనివర్సిటీ వాహనాలను వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడం, నియామకాలు, పదోన్నతుల్లో నిబంధనలు పాటించకపోవడం, రిక్రూట్‌మెంట్‌లో రూల్స్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఉల్లంఘనలను ఆయన ఎత్తిచూపారు.
మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ, ‘గత వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా బయటపెడతామని‘ అన్నారు. ‘కంప్యూటర్ల కొనుగోలులో దుర్వినియోగం, యూనివర్సిటీ వాహనాలను వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం, నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు, నియామకాలు, రిక్రూట్‌మెంట్‌లో రూల్స్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించకపోవడంపై కమిటీ వేస్తామన్నారు‘ అని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను పారదర్శకంగా నడిపించాలనే లక్ష్యంతో పని చేస్తోందని ఆయన తెలిపారు. ‘పారదర్శకంగా విశ్వవిద్యాలయాలు నడిపించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉందని తెలిపారు‘ అని ఆయన అన్నారు. చర్చలో ఆంధ్రా యూనివర్సిటీలో ఇటీవల జరిగిన ఒక సంఘటనను కూడా మంత్రి లోకేశ్‌ ప్రస్తావించారు. ‘గురువారం ఆంధ్రా యూనివర్సిటీలో ఒక విద్యార్థి ఫిట్స్‌తో చనిపోయారని.. దీనిపై కొన్ని విద్యార్థి సంఘాలు ఆందోళన చేయడం సరికాదన్నారు. ప్రభుత్వపరంగా ఎలాంటి తప్పు లేకపోయినా రాజకీయాలు చేయడం సరికాదని చెప్పారు‘ అని ఆయన వ్యాఖ్యానించారు.
అలాగే, విశ్వవిద్యాలయాల్లో రాజకీయ ప్రభావాన్ని అంతం చేయాలని, వైస్‌ చాన్సలర్ల నియామకాలు పారదర్శకంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రా యూనివర్సిటీని దేశంలోని టాప్‌ 100 యూనివర్సిటీల్లో ఒకటిగా తీర్చిదిద్దే బాధ్యతను తనకు అప్పగించారని ఆయన పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తులు స్వార్థం కోసం విద్యార్థులను రెచ్చగొట్టి గొడవలు çసృష్టిస్తున్నారని విమర్శించారు.
Read More
Next Story