
జీఎస్టీ స్లాబ్ సంస్కరణలను స్వాగతిస్తున్నాం
జీఎస్టీ స్లాబ్‌ల తగ్గింపుపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు.
జీఎస్టీ స్లాబ్‌లను మారుస్తూ తీసుకువచ్చిన సంస్కరణల్ని తాము స్వాగతిస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జీఎస్టీ స్లాబ్‌ల తగ్గింపుపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం ఆయన ట్వీట్ చేశారు. ఈ నిర్ణయం వల్ల నిత్యావసరాలు, విద్యా, ఆరోగ్యరంగం, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన పన్నులు గణనీయంగా తగ్గుతాయన్న సీఎం పేర్కొన్నారు. ఈ నిర్ణయం పేదలకు వరంగా మారనుందని, ఇది అభివృద్ధి కారకం కానుందన్నారు. సమాజంలోని వేర్వేరు వర్గాలకు ప్రత్యేకించి రైతుల నుంచి వ్యాపారుల వరకూ ప్రయోజనం కలుగుతుందనీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
We welcome the GST reforms with revised slabs across daily essentials, education, healthcare, and agriculture. This pro-poor, growth-oriented decision will benefit all sections of society, from farmers to businesses. I congratulate Hon’ble Prime Minister Shri Narendra Modi Ji and…
— N Chandrababu Naidu (@ncbn) September 3, 2025