అమరావతికి 15 వేల కోట్ల సాయం: నిర్మల
ఆంధ్రప్రదేశ్ పునఃవ్యవస్థీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
ఆంధ్రప్రదేశ్ పునఃవ్యవస్థీకరణ చట్టం లో పొందుపర్చిన అంశాలను అమలుచేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దీనికి ప్రారంభంగా ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కొన్ని వినూత్న సహాయ పథకాలు ప్రకంటించారు.ఇందులో ప్రధానమయినది అమరావతి రాజధాని నిర్మాణానికి భారీగా సాయం ప్రకటించడం.
అమరావతి అభివృద్ధికి వచ్చే సంవత్సరాలలో రూ.15 వేల కోట్ల సహాయం అందిస్తామని ప్రకటించారు. అదే విధంగా రాజధాని నిర్మాణానికి అవసరమయిన నిధులను ప్రపంచ బ్యాంకు మల్టీలేటరల్ డెవెలప్ మెంట్ అంతర్జాతీయ సంస్థలనుంచి ఆర్థిక సాయం అందేలా చూస్తామని కూడా ఆమె ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ వ్యవసాయాభివృద్ధికి జీవధార వంటి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడం ద్వారా భారతదేశంలో ఆహార కొరతకు చెక్ చెప్పొచ్చని ఆమె పేర్కొన్నారు. పోలవరం ప్రాజక్టును సకాలంలో పూర్తి చేయడం జరుగుతుందని కూడా ఆమె ప్రకటించారు.
అదే విధంగా అవసరాన్ని బట్టి అమరావతికి మరిన్ని నిధులు కేటాయిస్తామని కూడా తెలిపారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయిస్తామని, విశాఖ-చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు అందిస్తామని చెప్పారు.
పూర్వోదయం పథకం
తూర్పు భారత రాష్ట్రాల కోెసం ఆర్థిక మంత్రి కొత్త పథకం ప్రకటించారు. దానికి పేరు పూర్వోదయ. ఇందులో ఆంధ్రప్రదేశ్ ను కూడా చేర్చారు. ఇందులో బీహార్, జార్కండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.శ
ఇదే కాకుండా రెండు ఇండస్ట్రీయల్ కారిడార్లను కూడా కేంద్రం ప్రటించింది. ఇందులో ఒక కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ కాగా, రెండోది విశాక పట్నం దగ్గిర ఉండే కొప్పర్తి. ఒర్వకల్ కారిడార్, హైదరాబాద్ బెంగుళూర్ ఇండస్ట్రియల్ కారిడార్ కిందకి వస్తే, కొప్పరి విశాఖ చెన్నై కారిడార్ లో భాగంగా అభివృద్ధి చేస్తారని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
చంద్రబాబు సాధించారు
అయితే బడ్జెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు అదనపు నిధులు ఇవ్వడనాకి కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దీంతో ఢిల్లీకి వెళ్లి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చేసిన చర్చలు ఫలదాయకంగా మారాయని, అద్భుతమైన ఫలితాలనే వెలువరిచాయని పార్టీ శ్రేణులు అంటున్నాయి. అంతేకాకుండా విమర్శలు గుప్పించిన వారందరికీ కూడా చంద్రబాబు తన ఫలితాలతో సమాధానం చెప్పారని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఢిల్లీ చక్కర్లు కొడుతున్న చంద్రబాబు.. రాష్ట్రానికి ఏం తెస్తారో చూస్తామన్న వారంతా ఈరోజు కళ్లప్పజెపపి, నోర్లు తెరుచుకుని చూస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నాయి. టీడీపీ శ్రేణులు.
అచ్చన్నాయుడు సంతోషం
నవ్యాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాలకు రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయిస్తామని కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన NDA ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ , ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని మంత్రి అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.