
దాడులతో మా గొంతు నొక్కలేరు : జగన్
పథకం ప్రకారమే టీడీపీ మూకలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై దాడికి పాల్పడ్డారని మాజీ సీఎం జగన్ ధ్వజమెత్తారు.
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై జరిగిన దాడిని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని అంతం చేయాలనే దురుద్దేశంతోనే టీడీపీ మూకలు దాడికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగిందని మండిపడ్డారు. ఒక రాజకీయ నాయకుడిని టార్గెట్‌గా చేసుకుని ఆ నేత ఇంటిపై దాడి చేయడాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎప్పడూ చూసి ఉండమన్నారు.
తన చిత్తూరు జిల్లా పర్యటన, తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతుల సమస్యలు ప్రజల దృష్టిలో పడకుండా చేయడానికే పథకం ప్రకారం ఈ వివాదాన్ని సృష్టించారని, దానిని అడ్డం పెట్టుకుని ప్రసన్న ఇంటిపై దాడికి పాల్పడి, ఇదే అంశంపై రాష్ట్రప్రజలంతా మాట్లాడుకునేలా చేయాలనేదే టీడీపీ ప్లాన్ అని జగన్ మండిపడ్డారు. ఈ ముసుగులో ప్రజా సమస్యలు బయటకు రాకుండా చేయాలనేదే టీడీపీ కుట్రని సోషల్ మీడియా వేదికగా జగన్ ధ్వజమెత్తారు.
.@ncbn గారి దుర్మార్గపాలన మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, పన్నెండు దాడుల రూపంలో సాగుతోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై హత్యాప్రయత్నమే లక్ష్యంగా ఆయన ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వయోవృద్ధురాలైన ఆయన… pic.twitter.com/arTHH9lwhE
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 9, 2025