అవకాశాల్లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా : రాజేంద్రప్రసాద్‌
x

అవకాశాల్లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా : రాజేంద్రప్రసాద్‌

సినీ కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ తాను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనే విషయాన్ని చెప్పి హృదయాలను బరువెక్కించారు.


ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ తన మనసులో మాటను బయట పెట్టారు. తన నటనతో ప్రేక్షకులను అలరించిన నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ తన జీవితంలో చోటు చేసుకున్న ఎన్నో ఎత్తు పల్లాలను ఓ సారి జ్ఞాపం తెచ్చుకున్నారు. సినీ ప్రపంచంలోకి అడుగుడిన ∙తొలినాళ్ల కెరీర్‌ గురించి మాట్లాడుతూ తనకు అవకాశాలు లేకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పి ఖంగుతినిపించారు. చేతిలో సినిమాలు లేకపోవడం, ఎక్కడా అవకాశం దొరక్క పోవడంతో చేతిలో డబ్బులు ఉండేవి కాదని, దాదాపు మూడు నెలల పాటు అన్నం తినకుండా కాలం వెల్లదీసినట్లు చెప్పారు. ఇటీవల ఓ యూట్యూబ్‌ చాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిమ్మతిరిగి మైండ్‌ బ్లాక్‌ అయ్యే అనుభవాలను ఆయన పంచుకున్నారు.

తన తండ్రి ఓ స్కూల్‌ టీచర్‌ అని, ఆయన చాలా కఠినంగా ఉండేవారని తన బాల్యాన్ని, తాను సినిమాల్లోకి వెళ్లాలనే విషయాన్ని తన తండ్రితో చెప్పినప్పుడు ఆయన ఎలా వ్యవహరించారనే అంశాలను రాజేంద్రప్రసాద్‌ వివరించారు. అయితే ఇంజనీరింగ్‌ చదివ తాను అది పూర్తి అయిన వెంటనే సినిమాల్లో రావాలని నిర్ణయించుకున్నారు. దీనికి తన తండ్రి అసహనం వ్యక్తం చేశారని, నీ ఇష్టానికి వెళ్తున్నావు.. విజయమైన, అపజయమైనా నీకు సంబంధించిన విషయమని, ఒక వేళ సినిమాల్లో ఫెయిల్‌ అయితే ఇంటికి రావద్దు అన్నారని, అలా మాట్లాడిన తన తండ్రి మాటలు తనపై ఎంతో ప్రభావం చూపాయని అన్నారు. ఎలాగైనా సినిమాల్లో రాణించాలనే లక్ష్యంతో తాను మద్రాస్‌ వెళ్లి ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరానని, అందులో గోల్డ్‌ మెడల్‌ కూడా సాధించినట్లు చెప్పుకొచ్చారు. ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో గొల్డ్‌మెడల్‌ సాధించినా తనకు సినిమాల్లో అవకాశాలు మాత్రం రాలేదన్నారు.

అలా మానసికంగా నలిగిపోతున్న తరుణంలో తిరిగి ఇంటికెళ్లాలని వెళ్లానని, నన్ను చూసిన తన తండ్రి రావద్దు అన్నానుగా.. ఎందుకొచ్చావని తనపై కోప్పడ్డారని, తన తండ్రి మాటలకు తీవ్రంగా బాధపడిన తాను చావో రేవో తేల్చుకునేందుకు తిరిగి మద్రాస్‌ వెళ్లిపోయానని, ఆ సమయంలోనే ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ సమయంలో తన ఆత్మీయులందరినీ ఒక్క సారి చూడాలనిపించింది. దీంతో వాళ్ల ఇళ్లకు వెళ్లి మాట్లాడాను. ఆఖరుగా నిర్మాత పుండరీకాక్షయ్య ఆఫీసుకు వెళ్లాను. ఆ సమయంలో అక్కడ మేలుకొలుపు సినిమాకు హడావుడి జరుగుతోంది. తనను చూసిన ఆయన డబ్బింగ్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. అందులో ఒక సీన్‌ తనతో డబ్బింగ్‌ చెప్పించారు. అది పుండరీకాక్షయ్యకు బాగా నచ్చడంతో రెండో సీన్‌కు డబ్బింగ్‌ చెప్పమన్నారు. భోజనం చేసి చాలా రోజులైంది.. భోజనం పెడితే డబ్బింగ్‌ చెబుతానని ఆయనతో చెప్పానని, అదే సమయంలో అవకాశాల్లేక తాను ఆత్మహత్య చేసుకోవాలనే విషయం కూడా చెప్పానని, దీనికి కోప్పడిన పుండరీకాక్షయ్య తన ఇంటికి తీసుకెళ్లి మంచి భోజన పెట్టించి, ధైర్యం చెప్పారని అలా తన ఆత్మహత్యను మానుకున్నట్లు వివరించారు. అలా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా రాజేంద్రప్రసాద్‌ కెరీర్‌ మొదలైంది. తర్వాత దర్శకుడు వంశీతో పరిచయం కావడంతో రాజేంద్రప్రసాద్‌ జీవితం మారిపోయింది. స్టార్‌ హీరోగా ఎదిగారు. ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి సినీ ప్రేక్షుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

Read More
Next Story