
దావోస్ తరహాలో విశాఖ సమ్మిట్ సెషన్లు!
పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో దావోస్ తరహాలో వివిధ సెషన్లు నిర్వహించామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.
సీఐఐ 30 పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు వివిధ దేశాలకు చెందిన 30కి పైగా మంత్రులు పాల్గొన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఈ భాగస్వామ్య సదస్సు ముగింపు సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే.. ‘రెండు రోజుల సీఐఐ సదస్సులో భాగస్వామ్యాలు, పెట్టుబడులు, ఎంవోయూలు ఇలా 67 సెషన్లు నిర్వహించాం. దావోస్ తరహాలో ఈ సెషన్లను నిర్వహించగలిగాం. కేవలం పెట్టుబడులు మాత్రమే కాదు.. ఆలోచలను కూడా పరస్పరం ఈ సదస్సు ద్వారా పంచుకోగలిగాం. 60 దేశాలకు చెందిన ప్రతినిధులు, సీఐఐ భాగస్వామ్య సదస్సుకు 60 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. 700కి పైగా బీ–టూ–బీ సమావేశాలు జరిగాయి. సదస్సుకు హాజరైన కొందరు విదేశీ ప్రతినిధులు స్థానిక సంప్రదాయాలను పాటిస్తూ ఇక్కడి దుస్తులను ధరించి బ్రాండ్ అంబాసిడర్లయ్యారు. దేశానికి ప్రధాని మోదీ లాంటి బలమైన నాయకత్వం ఉంది. కేంద్రంలో, రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాలున్నాయి. 2047 వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగానే ప్రణాళికలను, పాలసీలను తయారు చేసుకుంటున్నాం.

