
వీఐపీలకు ఏడాదికోసారే శ్రీవారి దర్శనం
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అద్భుతమయిన సూచన
భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తిరుమల దర్శనాలకు సంబంధించి అద్భుతమయిన సూచన చేశారు. ఆయన చేసిన సూచన సామాన్యులకు కాదు. విఐపిలకు. ఎందుకంటే ఈ విఐపి లనే వాళ్ల బెడద ఈ మద్య ఆలయాల్లో ఎక్కువయింది. వీళ్ల దర్శనాల వల్ల సామాన్యుకుల సమస్యలు ఎదురవుతున్నాయి. అసలు దేవుడి దగ్గిర ఈ విఐపిలు , సామాన్య ప్రజలు అని ఏమిటో అర్థం కాదు. ఈ వేదాంతంలోకి వెళ్లొద్దు గాని, వెంకయ్యనాయుడు ఈ విఐపి లదర్శనాల మీద ఆంక్షలు విధించాల్సిందే అంటున్నారు.
సామాన్య భక్తుల సౌలభ్యం కోసం వీఐపీలు ఏడాదికి ఒకసారి మాత్రమే తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకోవాలని భారత ఆయన సూచించారు.
సోమవారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయనకు రంగ నాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి స్వామివారి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.