
అదిరేటి డ్రెస్ నేనేస్తే.. కదిలేటి డాన్స్ మీరేస్తే..
విజయవాడ ఉత్సవ్-2025లో ఫ్యాషన్ పరేడ్ ఫోటో ఫీచర్
విజయవాడ చరిత్రలో తొలిసారిగా—ఆంధ్రప్రదేశ్ టూరిజం సహకారంతో Society for Vibrant Vijayawada, Shreyas Media సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద వేడుక “విజయవాడ ఉత్సవ్ 2025”.
ఇందులో భాగంగా నిర్వహించిన ఫ్యాషన్ షో లోని చిత్రాలు ఇవి.
దేశంలోనే మొదటి అతి భారీ 11-రోజుల Concert Marathon సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు నగరంలోని వివిధ వేదికలపై జరుగుతుంది.
One City, One Celebration ప్రమేయంతో, విజయవాడ ఎక్స్‌పో–గొల్లపూడి, పున్నమిఘాట్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల వేంకటేశ్వరరావు గవర్నమెంట్ మ్యూజిక్ & డ్యాన్స్ కాలేజ్ వేదికలపై గ్రాండ్ స్టేజులు, వరల్డ్-క్లాస్ ప్రొడక్షన్, ఐకానిక్ ఆర్టిస్ట్‌లతో అద్భుతమైన సంగీత అనుభవాలు అందించనున్నారు.
ఇందులో భాగంగా నిర్వహించిన ఫ్యాషన్ షో ఇది.
ఈ ఉత్సవం విజయవాడ ఎక్స్‌పో–గొల్లపూడి, పున్నమిఘాట్ (కృష్ణా నదీతీరంలో), తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల గవర్నమెంట్ మ్యూజిక్ & డ్యాన్స్ కాలేజ్ సహా ఎన్నో వేదికలపై సాంస్కృతిక, సంగీత, సినీ కార్యక్రమాల్ని సమగ్రంగా తీసుకువస్తుంది.
దసరా పవిత్ర పరంపరను ఆధునిక వినోదంతో మేళవించి, విజయవాడను దక్షిణ భారత సాంస్కృతిక రాజధానిగా, మైసూర్ దసరాతో సమానంగా అంతర్జాతీయ స్థాయిలో ఉంచే లక్ష్యంతో ఈ ఉత్సవాన్ని రూపకల్పన చేశారు.
ఫొటోలు- రవి పెదపోలు
Next Story