విజయవాడ హాటెస్ట్‌ సిటీ, కూల్‌ పీపుల్‌
x

విజయవాడ హాటెస్ట్‌ సిటీ, కూల్‌ పీపుల్‌

భవిష్యత్‌లో విజయవాడ అభివృద్ధి చెందిన నగరంగా ఉండబోతుందని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ అన్నారు.


విజయవాడ హాటెస్ట్‌ సిటీ అని అయితే ఇక్కడ ప్రజలు కూల్‌ పీపుల్‌ అని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ అన్నారు. బుధవారం ఆంధ్రప్రదేశ్‌ పర్యటకు వచ్చిన ఆయన దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ.. విజయవాడ ఉత్సవ్‌ మరో వందేళ్లపాటు కొనసాగాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. విజయవాడ నగరం రానున్న రోజుల్లో అభివృద్ధి చెందిన నగరంగా ఉండబోతుందని సీపీ రాధాకృష్ణన్‌ ఆకాంక్షించారు. తాను ఉపరాష్ట్రపతి అయ్యాకా తొలి పర్యటన కింద విజయవాడకే వచ్చానన్నారు. తనకు విజయవాడలో అద్బుతమైన గౌరవం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు.

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను గొప్పగా ప్రదర్శించిన విజయవాడ నగరంలో తాను పర్యటించినందుకు చాలా గర్వంగా ఉందని, కనకదుర్గ పేరులోనే అనుగ్రహం, ప్రేమామృతాన్ని చూడగలుగుతున్నామని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ అన్నారు. భారత దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ అమ్మవారిని ఎంతో భక్తితో పూజిస్తామని, భారత దేశ వ్యాప్తంగా దేవీ నవరాత్రులు ఎంతో ప్రత్యేకమైనవని అన్నారు. మరే ఇతర పండుగలు లేని విధంగా 9 రోజుల పాటు కనక దుర్గమ్మని పూజించడం ఎంతో అదృష్టమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విద్య, వైద్య రంగాల్లో అభివృద్ది కొనసాగిస్తోందని, సీఎం చంద్రబాబు నాయకత్వంలో వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ దిశగా అభవృద్దిలో దూసుకుని పోతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కూడా అభివృద్ధి దిశగా కొనసాగుతోందన్నారు.

Read More
Next Story