ఆదివారం విజయవాడ దుర్గగుడి మూసివేత
x

ఆదివారం విజయవాడ దుర్గగుడి మూసివేత

తిరిగి సోమవారం దుర్గమ్మ అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.


సెప్టెంబరు 7వ తేదీ ఆదివారి విజయవాడ ఇంద్రకీలాద్రి మీద వెలసిన కనక దుర్గమ్మ అమ్మవారి దేవాలయాన్ని మూసివేయనున్నారు. చంద్రగ్రహణం కారణంగా ఆదివారం అమ్మవారి గుడిని మూసివేయాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు దుర్గమ్మ అమ్మవారి గుడితో పాటు ఉపాలయాలు కవాట బంధనం(తలుపులు మూసివేయబడును) ఉంటుందని దుర్గగుడి ఆలయ కమిటీ పెద్దలు తెలిపారు. గ్రహణ మోక్షకాల అనంతరం దుర్గమ్మ గుడి తెరవనున్నారు. అంటే సెప్టెంబరు 8వ తేదీ సోమవారం తెల్లవారు జామున మూడు గంటలకు కవాట ఉద్ఘటన(తిరిగి తలుపులు తీయడం) ఉంటుందని ఆలయ కమిటీ పేర్కొంది. స్నపన అభిషేకాల అంతనరం సోమవారం ఉదయం 8:30 గంటలకు నుంచి తిరిగి భక్తులకు దుర్గమ్మ అమ్మవారి దర్శనాలు ప్రారంభం కానున్నాయి.

Read More
Next Story