ఏపీకి కేటాయింపులపై విజయసాయిరెడ్డి ఏమన్నారో తెలుసా!
x

ఏపీకి కేటాయింపులపై విజయసాయిరెడ్డి ఏమన్నారో తెలుసా!

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి చేసిన కేటాయింపులపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. ఈరోజు రాజ్యసభలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్‌డీఏ, ఇండియా కూటములపై మండిపడ్డారు.


కేంద్ర బడ్జెట్ 2024లో ఆంధ్రకు ఇచ్చిన కేటాయింపులే ప్రస్తుతం హాట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధికి కేంద్రం కేటాయింపులు ఎంతో దోహదపడతాయంటూ మోదీ ప్రభుత్వానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో సంపద సృష్టించడం అంటే అప్పులు తెచ్చుకోవడమా అంటూ వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టి రాష్ట్రానికి చంద్రబాబు తెచ్చింది రూ.15వేల కోటలు అప్పు మాత్రమే అంటూ విమర్శలు గుప్పించారు మరికొందరు. ఈ నేపత్యంలో రాష్ట్రం, అసెంబ్లీలోనే కాదు ఆఖరికి పార్లమెంటులో కూడా ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. దీనిపై రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్‌డీఏ కూటమితో పాటు ఇండియా కూటమిపై కూడా ఆయన ధ్వజమెత్తారు. ఎవరికి వారు ఆంధ్రప్రదేశ్‌కు ఏదో లెప్ప ఇచ్చేసినట్లు వ్యాక్యానిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘మొత్తం ఏపీకే ఇచ్చారా?’

ఈ అంశంపై రాజ్యసభలో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. కేంద్ర బడ్జెట్‌లో మొత్తం రూ.48 లక్షల కోట్లు ఏపీకే ఇచ్చారా? అంటూ మండిపడ్డారు. బడ్జెట్ మొత్తం ఏపీకే ఇచ్చినట్లు ఎన్‌డీఏ గొప్పలు చెప్పుకుంటుంటే.. మరోవైపు నిధులన్నీ ఏపీకే ఇచ్చినట్లు ఇండియా కూటమి ఏడుస్తోందంటూ గట్టిగానే వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది కేవలం రూ.15 వేల కోట్లేనని, అది కూడా అప్పుగా మాత్రమే ఇవ్వడంలో గొప్ప ఏముందని ప్రశ్నించారు. ఆ ఇప్పిస్తామన్న రూ.15 వేల కోట్ల అసలు, వడ్డీ సహా కట్టాల్సింది ఏపీ ప్రజలు కాదా.. వారి బదులు కేంద్రం ఏమైనా కట్టుద్దా అని నిలదీశారు విజయసాయిరెడ్డి.

ఇచ్చేది అప్పు చెప్పుకునేది గొప్పలు

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు నిర్మల సీతారామన్. ఇందులో భాగంగానే అమరావతి నిర్మాణానికి మల్టీలేటరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీల ద్వారా రూ.15 వేల కోట్లు సమకూరుస్తామని, రానున్న సంవత్సరాల్లో కూడా సహకారం అందిస్తామని ఆమె వివరించారు. సాధారణంగా ఈ ఏజెన్సీలు వరల్డ్ బ్యాంకు, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు, ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు వంటివి. వాటి నుంచి రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లు అందిస్తామని నిర్మలమ్మ వ్యాఖ్యానించారు. అది రుణంగానే వస్తుంది. ఈ ఏజెన్సీల నుంచి నేరుగా రాష్ట్రాలు అప్పు తీసుకోవడం కష్టం కావున అక్కడ సహకరిస్తామని కేంద్రం చెప్పింది. అంటే దీనిని తిరిగి కట్టాల్సిన బాధ్యత ఏపీపైనే అధికంగా ఉంటుంది. ఏపీ ప్రభుత్వం దీనిని తిరిగి కట్టలేని సమయంలో ఆ మొత్తాన్ని కేంద్రం కట్టాల్సి ఉంటుంది. అంటే ఇచ్చింది పూర్తిగా రుణమే. దీనిని ఉద్దేశించే ఏపీకి ఇచ్చిందేమో రుణం పైగా గొప్పలు మాత్రం భారీ చెప్పుకుంటున్నారంటూ ఎన్‌డీఏను ఉద్దేశించి విజయసాయి రెడ్డి.. రాజ్యసభలో వ్యాఖ్యానించారు.

Read More
Next Story