మంటల్లో భగ్గుమన్న విహారీ ట్రావెల్స్ బస్సు
x
చిట్యాల వద్ద దగ్ధమవుతున్న విహారీ ట్రావెల్స్ బస్సు

మంటల్లో భగ్గుమన్న విహారీ ట్రావెల్స్ బస్సు

ఇప్పుడు నల్గొండ వద్ద తగలబడిన బస్సు విహారీ ట్రావెల్స్ వారిది, ప్రయాణీకులు క్షేమం


మొన్న కావేరీ, నిన్న జబ్బార్, ఇవాళ విహారీ.. ఇవన్నీ ప్రైవేటు ట్రావెల్స్ వారివే. ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (NH-65)పై పెద్ద ప్రమాదం తప్పింది. సుమారు 40 మంది ప్రయాణికులను తీసుకుని వెళ్తున్న విహారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ సమయస్ఫూర్తి, అప్రమత్తత కారణంగా ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.

విహారీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపుకు బయలుదేరింది. బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. పిట్టంపల్లి గ్రామ పరిసరాలకు చేరుకున్న సమయంలో బస్సు ఇంజిన్ భాగం నుండి పొగలు రావడం గమనించిన డ్రైవర్ బస్సును పక్కన ఆపేశారు. ప్రయాణికులందరినీ దిగిపొమ్మని పెద్దగా అరిచి చెప్పారు. దాంతో వారు ప్రయాణీకులు బస్సు నుంచి దిగి సురక్షితంగా బయటపడ్డారు.
ప్రయాణికులు దిగిన కొద్ది సేపటికే మంటలు వేగంగా వ్యాపించి బస్సు మొత్తం మంటల్లో కాలి బూడిదైంది. ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది.
బస్సులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. డ్రైవర్ వేగవంతమైన నిర్ణయం వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు కూడా డ్రైవర్ ధైర్యసాహసాలను కొనియాడారు.
Read More
Next Story