ఉపరాష్ట్రపతి ఎన్నికలు–వైసీపీ మాక్‌ పోలింగ్‌
x

ఉపరాష్ట్రపతి ఎన్నికలు–వైసీపీ మాక్‌ పోలింగ్‌

ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్‌కి మద్దతు ఇస్తున్నట్లు ఇప్పటికే వైసీపీ తెలిపింది.


భారత ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ మాక్‌పోలింగ్‌ నిర్వహించింది. ఢిల్లీలోని వైసీపీ రాజ్య సభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నివాసంలో వైసీపీ పార్లమెంట్‌ సభ్యులంతా సోమవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీల అంతా కలిసి ఉపరాష్ట్రపతి ఎన్నికలపై మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో చెల్లని ఓట్లను అరికట్టేందుకే ఈ మాక్‌ పోలింగ్‌ను నిర్వహించారు. మాక్‌ పోలింగ్‌కు ముందే ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌ని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కలిశారు. తమ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తమ వైసీపీకి చెందిన 11 మంది ఎంపీలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఓటేస్తున్నట్లు రాధాకృష్ణన్‌కు సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డికి రాధాకృష్ణన్‌ ధన్యవాదాలు తెలిపారు.

మరో వైపు భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి సహకరించాలని, అభ్యర్థి రాధాకృష్ణన్‌కు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వ బీజేపీ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. అందులో భాగంగా ఎన్టీఏ అభ్యర్థికి తమ మద్దతును ప్రకటిస్తున్నట్లు ఆ పార్టీ ఇది వరకే తెలిపింది. అంతేకాకుండా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా నాడు మోదీ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూనే వస్తున్నారు. నాడు కేంద్రం ప్రవేశపెట్టిన అనేక బిల్లులకు కూడా వైసీపీ మద్దతు పలికింది. ప్రతిపక్షంలో ఉన్న కూడా బీజేపీకే తమ మద్దతు తెలుపుతూ వస్తోంది.
మరో వైపు ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం చేస్తున్నారు. మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. రాధాకృష్ణన్‌ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రంగంలో ఉండగా, జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఇండియా కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మంగళవారం పది గంటలకు ఈ ఎన్నికల ప్రారంభం కానున్నాయి. సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో చెల్లని ఓట్లను అరికట్టేందుకు అన్ని పార్టీలు తమ ఎంపీలతో మాక్‌ పోలింగ్‌ను నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా వైసీపీ కూడా తన పార్టీ ఎంపీలతో ఢిల్లీలోని వైవీ సుబ్బారెడ్డి నివాసంలో మాక్‌ పోలింగ్‌ను నిర్వహించారు.
Read More
Next Story