
గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన వంశీ భార్య పంకజశ్రీ
వల్లభనేని వంశీమోహన్ మీద అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన భార్య పంకజశ్రీ గవర్నర్‌కు ఫిద్యారు చేశారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ భార్య పంకజశ్రీ శుక్రవారం విజయవాడ రాజ్‌భన్‌లోని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. తన భర్త వల్లభనేని వంశీ మీద కూటమి ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసుల చేత అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. వీటి మీద చర్యలు తీసుకొని, తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌లతో కలిసి వంశీ భార్య పంకజశ్రీ గవర్నర్‌ను కలిశారు.
జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు మీద, లోకేష్ మీద, టీడీపీ మీద, నారా భువనేశ్వరి మీద వల్లభనేని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీపై వివిధ రకాల కేసులు నమోదు చేశారు. గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసుతో పాటు, అదే టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్థన్ కిడ్నాప్ కేసు, భూ ఆక్రమణ కేసులు ఆయన మీద నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్నారు.
Next Story