
జగన్‌ను కలిసిన వంశీ
బుధవారం నాడు మాజీ ఎమ్మెల్యే వంశీని జైలు నుంచి విడుదలయ్యారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. తాడేపల్లి వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో తన భార్య పంకజశ్రీతో కలిసి వంశీ గురువారం జగన్‌తో భేటీ అయ్యారు. దాదాపు 140 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీని చూసి జగన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వంశీ ఆరోగ్యం గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు. జైల్లో తాను పడిన ఇబ్బందుల గురించి జగన్‌కు వివరించారు.
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడితో పాటు సత్యవర్థన్ కిడ్నాప్, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు, నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ, అక్రమ మైనింగ్ కేసుతో పాటు వల్లభనేని వంశీ మీద 11పైగా కేసులు నమోదు చేశారు. ఈ కేసులన్నింటిల్లోను వంశీ బెయిల్ మంజూరు చేశారు. అయితే అక్రమ మైనింగ్ కేసులో మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ కూటమి ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు వంశీ బెయిల్‌ను రద్దు చేసేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో బుధవారం విజయవాడ జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదలయ్యారు.
Next Story