వంశీని టార్చర్‌ పెడుతున్నారు
x

వంశీని టార్చర్‌ పెడుతున్నారు

కూటమిలో పైన పొత్తులు లోపల కత్తులు పెట్టుకొని ఒకరికి ఒకరు పడటం లేదని, లోకేష్‌ను పైకి తెచ్చేందుకే ప్రయత్నాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ అన్నారు.


గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ జైల్లో టార్చర్‌ పెడుతున్నారని ఆయన భార్య పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, పెనమలూరు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జీ దేవభక్తుని చక్రవర్తితో కలిసి శుక్రవారం విజయవాడ జైల్లో వంశీతో ఆమె ములాఖత్‌ అయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తీవ్ర ఆవేనను వెల్లబుచ్చారు. వంశీ అనారోగ్యం బాగాలేదని, ఆస్తమాతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జైల్లో ఉండాల్సిన కనీస సౌకర్యాలు కూడా వంశీకి కల్పించడం లేదన్నారు. వంశీని ఇంకా మెంటల్‌ డిప్రెషన్‌కు గురి చేయాలని కుట్రలు పన్నుతున్నారని, ఇది తప్పు కాదా? అని ప్రశ్నించారు. రూల్స్‌ ప్రకారం వంశీ మీద ఏ కేసు లేదని, కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని, ఇది సరికాదన్నారు.

సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేయలేక సీఎం చంద్రబాబు కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ మండిపడ్డారు. సత్యవర్థన్‌ కడ్నాప్‌ జరగనే లేదని, వంశీకి ఎలాంటి సంబంధం లేదనే విషయం కూడా సత్యవర్థన్‌ వాంగ్మూలంలోనే తెలిసి పోయిందన్నారు. సత్యవర్థన్‌ 10వ తేదీన జడ్జి ముందు వాంగ్మూలం ఇస్తే.. 11వ తేదీనా కిడ్నాప్‌ చేసినట్లు వీడియో విడుదల చేశారని, 2004లో గన్నవరానికి వంశీ రాకముందు ఉన్న కేసులు కూడా వంశీకి ఆపాదించారని కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఎలాంటి సంబంధం లేని విషయంలో 21 సంవత్సరాల తర్వాత వంశీ మీద క్రిమినల్‌ కేసు పెట్టారని ఇది తప్పుడు విధానమని అన్నారు. హోం మంత్రి అనిత బూతుల అర్థం వచ్చే విధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు మాట్లాడే మాటలు బూతులు కాదా? అని ప్రశ్నించారు. మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే కూన రవికుమార్, రాయపాటి అరుణ, గాయత్రీలవి బూతులు కాదా? అని ప్రశ్నించారు. వంశీ భార్య మీద కూడా బూతులు మాట్లాడించారని ధ్వజమెత్తారు. కొడుకులు అని వపన్‌ అంటే అది బూతు కాదా? అని ప్రశ్నించారు. కమ్మ సామాజిక వర్గంలో లోకేష్‌ను నాయకుడిగా చేయాలనే ఉద్దేశంతోనే తక్కిన వారిని తొక్కేయాలని చూస్తున్నారని అన్నారు. కూటమిలో పైన పొత్తులు లోపల కత్తులు పెట్టుకొని ఒకరికి ఒకరు పడక లోకేష్‌ను పైకి తేవాలని, సూపర్‌ సిక్స్‌ హామీలు తప్పించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.
Read More
Next Story